హైదరాబాద్

పరిసరాల శుభ్రతతో మలేరియాను పారదోలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: మనిషి ఆరోగ్యంగా ఉండటానికి పరిసరాల శుభ్రత చాలా అవసరమని, మలేరియాను నిర్మూలించడానికి ప్రజలలో చైతన్యం తెస్తున్నామని, ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణలో మలేరియాను పారద్రోలాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయంలో అందరం సహకరిస్తామని అతిధులు, ఆహ్వానితులు, ప్రేక్షకుల చేత కమిషనర్ ప్రమాణం చేయించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుందామని చెప్తూ ఒక దోమ సుమారు వెయ్యిగుడ్లు పెడితే, ఆ గుడ్లు దోమలై మరల గుడ్డు పెడితే సంవత్సరానికి జనాభాను మించిన దోమలు ఉన్భవించగలవని, అందుకే దోమలను సంహరించాలని అన్నారు. మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు ఉద్భవించడానికి అవకాశం ఉందని చెప్తూ మురుగునీరు లేకుండా జాగ్రత్తపడాలని అన్నారు. మలేరియా ద్వారా చాలా మంది చనిపోతున్నారని, పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు పరిశుభ్రత బోధించి తద్వారా ప్రజల్లో చైతన్యం తేవాలని అన్నారు. ఈ ప్రసంగంలో మైకు సరిగ్గా పనిచేయకపోవడంతో అంతరాయం కలుగుతున్నప్పుడు ఇటీవల లక్షలాది రూపాయలు ఖర్చుచేసి మరమ్మతులతో కొత్త పరికరాలు వేసామని అధికారులు చెప్పారుగా... ఏమైంది... అని ప్రేక్షకులు వ్యాఖ్యానించారు. తొలుత ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వరి తివారి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా శ్రద్ధ తీసుకొని పోలియోను నిర్మూలించామని అలాగే 2030 నాటికి మలేరియాను నిర్మూలిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లలితాకుమారి, డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థినులు మలేరియా రాకుండా ఎలా జాగ్రత్తపడాలనే అంశంపై ప్రత్యేక నాటికి ప్రదర్శించారు.