హైదరాబాద్

సస్పెన్షన్ నిరసిస్తూ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 27: రూరల్ వాటర్ సప్లై శాఖలో విధులు నిర్వహిస్తున్న ఎఇని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ శాఖ ఇంజనీర్లు ఎర్రమంజిల్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. గురువారం ఉదయం తెలంగాణ రూరల్ వాటర్ సప్లై ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన వారు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షడు ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేందర్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీ చేస్తున్న సందర్భంలో ఏఇ శరణ్య అందుబాటులో లేదన్న విషయాన్ని కారణంగా చూపుతూ జిల్లా కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం విచారకరమన్నారు. ఇంజనీర్లు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఆ శాఖకు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మాత్రమే ఉంటుందన్న విషయాన్ని సైతం మరిచి కలెక్టర్ ప్రవర్తించారని ఆరోపించారు. మిషన్ భగీరథ పనుల్లో కీలక భూమిక వహించే ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్లను వేధించడం సరికాదని, ఇదే తరహా కొనసాగితే విధులు నిర్వహించలేమని వాపోయారు. భోజన విరామ సమయంలో నిరసన జరుగుతున్న చోటికి ఇఎన్‌సి సురేందర్ రెడ్డి వచ్చి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవంటూ, సదరు ఇంజనీరు యథావిధిగా విధులు నిర్వహించుకోవచ్చునని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇంజనీర్లు రాములు, ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల దోపిడీ.. ముగ్గురి అరెస్టు

హైదరాబాద్, ఏప్రిల్ 27: సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో రాత్రి సమయాల్లో ప్రయాణికులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని గోపాలపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ఒక సిల్వర్ చైన్, రింగ్, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బోయిన్‌పల్లికి చెందిన జెట్ట సంతోష్ యాదవ్ (25), క్లాక్ టవర్ వద్ద ఉండే ఆకుల నాగరాజు (24), మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన ఆనె శి (19) ముగ్గురు కలసి కాచిగూడ, సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో రాత్రి వేళల్లో ప్రయాణికులను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్నారు. వీరిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈనెల 23న ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి చైన్, రింగ్, సెల్‌ఫోన్ లాక్కోగా గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు నార్త్‌జోన్ డిసిపి బి సుమతి తెలిపారు.
మరో నిందితుడి అరెస్టు
సికిందరాబాద్ రైల్వే స్టేషన్ టికెట్ల కౌంటర్ వద్ద దృష్టి మళ్లించి చోరీకి పాల్పడుతున్న మరో నిందితుడిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం టౌన్, ఖిలాబజార్‌కు చెందిన మహమ్మద్ మతీన్ (25) సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల దృష్టి మళ్లిస్తూ, చోరీకి పాల్పడుతున్నాడు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు మతీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్స్‌పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు.