హైదరాబాద్

తమ్ముళ్లూ.. సమాయత్తంకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: మహానగరంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు సమాయత్తం కావాలని నగర పార్టీ కన్వీనర్ ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే బూత్ కమిటీలు, డివిజన్ కమిటీలపై సమీక్ష పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. గురువారం హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న మహానాడు 2017పై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. మే 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మినీ మాహానాడు నిర్వహించి, జిల్లా మహానాడు, రాష్ట్ర మహానాడు నిర్వహించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత మే 22న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మే 27 నుంచి 29వరకు మూడురోజుల పాటు విశాఖపట్నంలో జరిగే జాతీయ మహానాడు సభకు నగరానికి చెందిన తెలుగు తమ్ముళ్లు కూడా హజరుకావాలని సమావేశంలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం పూర్తి చేయాలేదని, 2018 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సనత్‌నగర్ నియోజకవర్గంలోని రెండు ప్రాంతాల్లో మళ్లీ డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపనలు చేశారని ఎంఎన్.శ్రీనివాస్‌రావు విమర్శించారు. శంకుస్థాపన చేసిన రెండు ప్రాంతాలకు సంబంధించి కోర్టులో స్థల వివాదాలున్నాయని, ఆ స్థలం ప్రభుత్వానిది కాదు, తనదని గంగిడి ఎల్లారెడ్డి అనే స్థల యజమాని బహిరంగంగా కెటిఆర్‌పై తిరుగబడితే ప్రస్తుతం శంకుస్థాపన మాత్రమే చేస్తామని, కోర్టులో వివాదం తేలిన తర్వాత పూర్తి స్థాయి నిర్మాణాలను చేపడుతామని ఆయన్ను సముదాయించి శంకుస్థాపన చేసి వెళ్లిపోయారని శ్రీనివాస్‌రావు ఆరోపించారు. అంతేగాక, నిబంధనలకు విరుద్దంగా రాత్రి వేళల్లో నిర్వహించే హోటళ్లు, వాణిజ్య సంస్థలను బెదిరించి, ఉదయం కూలీ పేరిట లక్షలాది రూపాయలు సభ పేరిట వసొలు చేస్తూ,అవినీటి అక్రమాలకు పల్పాడ్డారని ఆరోపించారు. జిల్లా కో కన్వీనర్ మేలక సారంగపాణి మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం శంకుస్థాపనలు చేసినా, అందులో ఏ ఒక్కటి కార్యరూపం దాల్చలేదని, మున్సిపల్ ఎన్నికల ముందు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపడుతామని హడావుడి చేస్తూ జిల్లా మొత్తం శంకుస్థాపనలు చేసినా, ఎక్కడా కూడా పనులు ప్రారంభించలేదన్నారు.

భావ ప్రకటనా స్వేచ్ఛను
హరించటం దారుణం
15న చలో ఇందిరాపార్కుకు తరలిరావాలి * ప్రొఫెసర్ కోదండరాం
చిక్కడపల్లి, ఏప్రిల్ 27: ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించటం దారుణమని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మక్దుం భవన్‌లో ధర్నా చౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని చేపట్టిన దీక్షలలో గురువారం 13వ రోజు జర్నలిస్టులు దీక్ష చేపట్టగా కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ధర్నా చౌక్ అన్నది కేవలం ఏ ఒక్క వర్గానికో సంబంధించినది కాదని, ఇది అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచే ఒక వేదిక అన్నారు. ధర్నా చౌక్‌ను ఊరి చివరకు తరలించాలనే నిర్ణయం సరియైనది కాదని, వెంటనే ప్రభుత్వం ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని సూచించారు. ధర్నాచౌక్ ను పరిరక్షించుకునేందుకు జర్నలిస్టులు కూడా దీక్ష చేపట్టాల్సి రావటం దురదుష్టకరమని అన్నారు. మే 15న చేపట్టిన చలో ఇందిరా పార్కు కార్యక్రమానికి కూడా వామపక్షాలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులు అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. మన తెలంగాణ సంపాదకుడు శ్రీనివాసరెడ్డి.. దీక్షలను ప్రారంభించగా నవతెలంగాణ సంపాదకుడు ఎస్.వీరయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, సజయ, రాజ్యసభ మాజీ సభ్యులు అజీజ్ పాషా పాల్గొని దీక్షలకు సంఘీభావం తెలిపారు. ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ పిఎల్ విశే్వశ్వరరావు నిమ్మరసంతో దీక్షను విరమింపచేశారు.