హైదరాబాద్

ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 28: దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు బిజెపి కుట్రలకు పాల్పడుతోందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల పద్ధతిని కొనసాగించాలని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘దేశంలో ఒకేసారి ఎన్నికలు - దాని పర్యవసానాలు’ అనే అంశంపై ‘మనరాజ్యం’ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం సామాజిక రాజకీయ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కటారి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత తులసీరెడ్డి, మాజీ మంత్రి మైసూరరెడ్డి, డివివిఎస్ వర్మ, సిపిఐ నేత కె.రామకృష్ణ, ఆంధ్రా మేధావుల ఫోరం నాయకుడు శ్రీనివాసులు, మాజీ ఎంపి.రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కె.నాగేశ్వర్, సినీయర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి, కొమ్మినేని శ్రీనివాసరావు, తెలంగాణ లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మన్నారం నాగరాజు, ఎపిసివిల్ సోసైటీ ప్రతినిధి డి.సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసీరెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను నాశనం చేయాడానికి జాతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. దేశాన్ని విభజించేందుకు కుట్ర జరుతుందన్నారు. ఒకేసారి పార్లమెంట్, శాసనసభకు ఎన్నికలు మనకు కొత్త కాదని 1952 నుంచి 1967 వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్రాల అభివృద్ధి ప్రాంతీయ అకాంక్షలు విస్మరణకు గురయ్యాయని అన్నారు. మైసురారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్, శాసనసభ ఎన్నికల మద్య కనీసం రెండు సంవత్సరాలు తేడా ఉండాలన్నారు. ఒకేసారి ఎన్నికల పద్ధతి సరైంది కాదని స్పష్టం చేశారు. బలాన్ని తగ్గించడానికి మన దేశానికి తగిన దామాషా పద్ధతి ఎన్నికల పద్ధతిని తీసుకురావాలని, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించి ఓటుహక్కు సభ్యత్వం రద్దయ్యే ఏర్పాటు చేయాలన్నారు. మధ్యంతరంగా ఏ చట్ట సభ రద్దయినా 5 ఏళ్లలో మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరపాలని సూచించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించినంత మాత్రాన వేళ్లూనుకుపోయన రుగ్మతలు అన్నీ సమసిపోవని డివివిఎస్ వర్మ స్పష్టం చేశారు. తప్పులతడక ఓటర్ల జాబితాలు, ఓట్ల కొనుగోలు, ప్రలోభాలు, ప్రజాప్రతినిధుల ఫిరాయంపులు విచ్చలవిడిగా సాగిపోతున్నాయని ఆయన అన్నారు. అయతే పాలనాపరంగా కొంత వెసులుబాటు అయతే ఉంటుందేమోకానీ సర్వరోగ నివారిణికాదని వర్మ తెలిపారు. అలాగే ఒకేసారి ఎన్నికలు అన్నది కొత్తకాదని, 1952 నుంచి 67 వరకూ జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల్లో ధన బలం తగ్గాలని, దామాషా పద్ధతిలో ఎన్నికలు రావాలని ఆయన ఆకాంక్షించారు. సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ఖర్చుకు పరిమితి ఉన్న కోట్ల ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. కుల, మత ప్రచారాల ఆంక్షల ఉల్లంఘనలు, మేనిఫెస్టోల నిండా ప్రభుత్వ ఖజానాను గుల్లచేసే జనాకర్షణ ప్రలోబ పథకాలతో ప్రజలకు మోసం చేస్తున్నారని విమర్శించారు. నాలుగు నెలల పాలన పక్కనపెట్టి ఎన్నికల చుట్టూ పార్టీలు తిరగడం జరుగుతుందని, పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.