హైదరాబాద్

‘మెట్రో’పనుల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: తరుచూ ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే నగరవాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రోరైలును తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అందుబాటులోకి తెచ్చేందుకు మెట్రోరైలు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే కారిడార్ 3లోని నాగోల్-బేగంపేట, కారిడార్ 1లోని మియాపూర్-సంజీవరెడ్డినగర్ కారిడార్లలో తరుచూ ట్రయల్ రన్ నిర్వహిస్తున్న అధికారులు నిర్ణీత గడువుగా పెట్టుకున్న జూన్ 2లోపు అన్ని రకాల అడ్డంకులను క్లియర్ చేసుకుని మెట్రోరైలును అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి శనివారం పలు ప్రాంతాల్లో పనులను తనిఖీ చేసి మెట్రో పనులు మరింత వేగవంతం చేసేందుకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను, వాటిని ఎలా పరిష్కరించాలన్న అంశాన్ని పరిశీలించారు. మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద వాటర్ స్టాగినేట్ అయ్యేందుకు కారణాలను అనే్వషించిన అధికారులు, అందుకు ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి స్టేషన్‌లో నీరు నిల్వకుండా చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అలాగే ఈ స్టేషన్‌కు ఇరువైపులా ఫుట్‌పాత్‌ను, రోడ్డును ఆక్రమించుకుని వెలిసిన ఆటో, బస్ బేలతో పాటు ఫర్నిచర్ షాపులను వెంటనే తొలగించాలని ఆయన ఆదేశించారు. మియాపూర్ నుంచి హైదర్‌నగర్‌ల మధ్య సుమారు రెండు కిలోమీటర్ల స్ట్రెచ్‌లో రాహ్‌గిరి అనే స్పెషల్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే స్టేషన్‌లో పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన జోన్‌లో యోగా జోన్, విలేజ్ గేమ్స్ జోన్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారికి సౌకర్యంగా ఉండేలా వౌలిక వసతులను కల్పించాలని ఎండి సంబంధిత అధికారులను ఆదేశించారు. మెట్రోరైలు అధికారులు మెట్రో డిపోల నుంచి మెయిన్‌రోడ్లకు ఏర్పాటు చేసిన ప్రత్యేక లైన్లలో ఇప్పటికే ఉన్న వాటర్ లైన్ల బదిలీ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. అన్ని స్టేషన్ల ఆవరణల్లో చక్కటి పచ్చ్ధనాన్ని ప్రోత్సహించేలా పచ్చటి మొక్కలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ మెట్రోరైలు చీఫ్ ఇంజనీర్ జియావుద్దిన్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డివిఎస్.రాజు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం. విష్ణువర్దన్‌రెడ్డి, జనరళ్ మేనేజర్(పనులు) బిఎన్.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.