హైదరాబాద్

వర్షాకాల కష్టాలపై ‘మహా’ ప్రణాళిక సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: వర్షాకాలం సమీపిస్తుండటంతో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకెదురయ్యే ఇబ్బందులను నివారించే ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి కూడా వానాకాలం కష్టాలను తగ్గించేందుకు సుమారు రూ. 27.84 కోట్ల వ్యయంతో 300 పనులను చేపట్టాలన్న లక్ష్యంగా ప్రణాళికను సిద్దం చేసుకుంది. ఇందులో భాగంగా తరుచూ కరిసే వర్షాల కారణంగా రోడ్లకు మరమ్మతులు చేసేందుకు వాతావరణం సహకరించకపోవటంతో వర్షాకాలానికి ముందే రోడ్లపై గుంతలకు మరమ్మతులను చేపట్టేందుకు వీలుగా 48 బృందాలు రౌండ్ ది క్లాక్ పనిచేసేలా నియమించారు. అలాగే మరో 121 బృందాలు వర్షం కురుస్తున్నపుడు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, ఆగమేఘాలపై ఘటనస్థలానికి వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా 121 బృందాలను సిద్దం చేశారు. ఈ బృందాలకు ప్రత్యేక వాహనంతో పాటు లేబర్, సహాయక చర్యలు చేపట్టేందుకు కావల్సిన పంప్‌లు, ట్రీ కట్టర్లు అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు ఎలాంటి యంత్రాల్లేకుండా మ్యానువెల్‌గా వర్షాకాలం సహాయక చర్యలను చేపట్టేందుకు 51 ప్రాంతాలను గుర్తించి, ఒక్కో ప్రాంతంలో ఇద్దరు లేబర్లు ఇరవై నాలుగు గంటల పాటు విధి నిర్వాహణలో ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. వీటికి తోడు భారీగా వర్షం కురిసి పెద్ద సమస్య, విపత్కర పరిస్థితులు తలెత్తినపుడు హటాహుటీన సహాయక చర్యలు చేపట్టేందుకు 19 సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలను సిద్దం చేశారు. ఇక చిన్నపాటి వర్షానికే నీరు నిలిచే పలు ప్రధాన కూడళ్లు, మెయిన్‌రోడ్లలో తరుచూ నీరు నిలిచే 234 ప్రాంతాలను గుర్తించి, వీటిలో 74 ప్రాంతాల్లో భారీగా నీరు నిలుస్తున్నట్లు నిర్థారించారు. వీటిలో అతి సమస్యాత్మకంగా నీరు నిలిచే పది ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎప్పటికపుడు నీటిని తోడేసేందుకు వీలుగా పంప్ సెట్లను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఈరకంగా వాటర్ స్టాగినెట్ అయిన 74 ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి బృందాలు 43 ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు, మరో 32 ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. వీటితో పాటు స్వల్పంగా నీరు నిలిచి, ట్రాఫిక్‌కు పెద్ద అంతరాయంగా మారిన మరో 133 ప్రాంతాలను గుర్తించి, వాటిలో మంగళవారం కురిసిన వర్షానికి 79 ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టినట్లు, మరో నాలుగు ప్రాంతాల్లో చర్యలు కొనసాగుతుండగా, మిగిలిన 50 ప్రాంతాల్లో చర్యలు చేపట్టాల్సి ఉందని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. ప్రతి వర్షాకాలం సందర్భంగా జలమండలి కూడా ఎమర్జెన్సీ బృందాలను సిద్దం చేస్తోంది. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే సిద్దం చేసిన ఈ బృందాలను జూలై నుంచి పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. కానీ మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా ఈ బృందాలను జూన్ మాసం నుంచే రంగంలో దింపనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు.