హైదరాబాద్

నేరరహిత నగరంగా తీర్చిదిద్దుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చిక్కడపల్లి, మే11: నగరాన్ని నేరరహిత నగరంగా తీర్చిదిద్దుకుందామని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్, రాంనగర్, కవాడిగూడ డివిజన్లలో మధ్యమండల డిసిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో 61 సిసి కెమెరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎంఎల్‌సి నిధుల నుండి దాదాపు రూ.40 లక్షల వ్యయంతో సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ప్రపంచంలోనే హైదరాబాద్ మొదటి స్థానం సంపాదించుకుందని అన్నారు. నేరరహిత నగరంగా తయారయితే విదేశీపెట్టుబడులు పెరిగి భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 1300 కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని, వీటితో 45వేల మందికి ఉపాధి కలుగుతుందని వివరించారు. డిసిపి జోయల్ డేవిస్ మాట్లాడుతూ నగరంలో లక్ష సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యముందని అన్నారు. గతంలో ఏడాదికి రెండువేల చైన్ స్నాచింగ్‌లు జరుగితే 2016లో 92 మాత్రమే జరిగాయని, ఈ సంవత్సరం సిసి కెమెరాల సంఖ్య మరింతగా పెంచటంతో పూర్తిగా చైన్ స్నాచింగ్‌లు ఆగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలనీ సంఘాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు కూడా స్వచ్ఛందంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చిక్కడపల్లి ఎసిపి జె.నర్సయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమాలలో అడిషనల్ డిసిపి శశిధర్ రాజు, టిఆర్‌ఎస్ ముషీరాబాద్ ఇన్‌చార్జ్ ముఠా గోపాల్, మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు ముఠా పద్మా నరేష్, ఎడ్ల భాగ్యలక్ష్మి, జయరాంరెడ్డి, చిక్కడపల్లి సిఐ సుదర్శన్, గాంధీనగర్ సిఐ ఆర్.శ్రీనివాస్, ముషీరాబాద్ సిఐ రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.

కేంద్రమంత్రికి ఘనస్వాగతం

హైదరాబాద్, మే 11: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ గురువారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, బిజెపి నేతలు నాగం జనార్దన్ రెడ్డి, ఆచారి, పెరిక సురేశ్‌లు శంషాబాద్ ఏయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి 13వ పార్లమెంటు బూత్ స్థాయి సమావేశానికి హజరయ్యేందుకు కేంద్ర మంత్రి నగరానికి విచ్చేసినట్లు నేతలు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలిపారు. ప్రదాని మోది పాలనలో, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన దక్షిణ భారతదేశంలో బిజెపి ఎదురులేని శక్తిగా ఎదుగుతోందని ఈ సందర్భంగా బిజెపి నేత పెరిక సురేశ్ వ్యాఖ్యానించారు.