హైదరాబాద్

నేడు జిల్లా టిడిపి మహానాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడును బుధవారం నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఇందుకు కాను స్వరం సిద్ధం చేశారు. ఈ మేరకు నగర టిడిపి ఇంఛార్జి పెద్దిరెడ్డి నగర కన్వీనర్ ఎం.ఎన్. శ్రీనివాసరావు ఇతర నేతలు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టిడిపి పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వాహణానంతరం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, ఆ తర్వాత జిల్లా స్థాయిలో మహానాడు నిర్వహించుకోవటం ఆనవాయితీ అని వివరించారు. ఈ రకంగా తెలంగాణలోని 31 జిల్లాల్లో మహానాడు కార్యక్రమాలు నిర్వహించినానంతరం రాష్ట్ర స్థాయి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించుకుని, నేతలు, కార్యకర్తలకు దశాదిశా నిర్దేశించనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగానే బుధవారం ఇందిరాపార్కు సమీపంలోని నగర పార్టీ కార్యాలయంలో మహానాడును నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఈ నెల 22వ తేదీలోపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ జిల్లా స్థాయి మిని మహానాడు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 24వ తేదీన నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 10 వేల మంది ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర స్థాయి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి టిడిపి జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహానాడులో 8 ముఖ్యమైన అంశాలకు సంబంధించి కీలక తీర్మానాలు చేయనున్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. వీటిలో రైతులకు మద్దతు ధర, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, చేతివృత్తుల వారికి చేయూత, విద్యా, వైద్యం, సాగు, తాగునీరు, మహిళా అభ్యుదయం, సంక్షేమం, బిసి సంక్షేమం అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు వివరించారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగట్టేలా నేతలు, కార్యకర్తలను చైతన్యవంతులను చేయనున్నట్లు ఆయన తెలిపారు. నగర కన్వీనర్ ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ బుధవారం పార్టీ ఆఫీసులో నిర్వహంచనున్న జిల్లా మహానాడు కార్యక్రమానికి నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరానున్నట్లు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో వారితో పాటు నేతలు భజరంగ్ శర్మ, వనం రమేష్ తదితరులున్నారు.

ఎటిఎంలలో సమృద్ధిగా డబ్బులు ఉంచాలి

*ఎస్‌బిఐ అధికారికి రంగారెడ్డి డిసిసి వినతి

హైదరాబాద్, మే 16: బ్యాంకులు, ఎటిఎంలలో సమృద్ధిగా నగదు నిల్వలు ఉంచి మధ్య, పేద తరగతి ప్రజల నగదు కష్టాలని తీర్చాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరారు. మంగళవారం నగరంలోని గన్‌ఫౌండ్రీ ఎస్‌బిఐ ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, మాజీ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్, బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీ్ధర్, రవికుమార్ యాదవ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.