హైదరాబాద్

నలుగురు మృతితో పెళ్లింట పెను విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ / మోతె, మే 17: సూర్యాపేట జిల్లా మోతె శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెంది న నలుగురు మృతిచెందగా మరో 20 మంది తీవ్రగాయాల పాలుకావడంతో బంధుమిత్రుల రోదనలు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మిన్నంటాయి.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రగతినగర్‌కు చెందిన తప్పెట శేషసాయినాథ్ (22)కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రానికి చెందిన నాగలక్ష్మితో బుధవారం వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి హాజరయ్యేందుకు డిసిఎంలో వెళ్తూ తెల్లవారు జామున మోతె వద్ద ఆగారు. ఈ సమయంలో లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో పెళ్లి కుమారుడు శేషసాయినాథ్‌తో పాటు అతని తాత సత్యనారాయణ (65), అల్లుడు అఖిల్ (4), హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన మిత్రుడు దామోదర్‌నాయుడు (35) ప్రమాదంలో మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. మరో 20మంది బంధువులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న బంధువులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకొని మృతదేహాలను చూసి కంటతడి పెట్టారు. ముక్కుపచ్చలారని చిన్నారి అఖిల్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వధువు సత్యనాగలక్ష్మి ఆసుపత్రికి చేరుకొని మృతదేహాలను, గాయపడిన బంధుమిత్రులను చూసి కన్నీటిపర్యంతం కావడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. పెళ్లింట విషాదం నింపిన ఈ ప్రమాదం ఇరు కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది.
ప్రమాదస్థలిని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సూర్యాపేట-ఖమ్మం రహదారిపై మండల కేంద్రం శివారులో గల పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరో 20 మందికి గాయాలైన సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్, ఎస్పీ పరిమళ హనానూతన్‌లు ప్రమాదస్థలిని పరిశీలించారు. తొలుత ప్రమాదస్థలికి చేరుకున్న వీరు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ప్రమాదానికి కారణమైన లారీని పరిశీలించారు. ఆ తర్వాత సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెప్పారు.