హైదరాబాద్

సెంట్రల్ బ్యాంక్‌లో చోరీకి విఫల యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీకి విఫల యత్నం జరిగింది. హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్‌లోని సెంట్రల్ బ్యాంక్ బ్రాంచిలో బుధవారం రాత్రి దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్ కిటికీ గ్రిల్స్ తెరచి లోనికి ప్రవేశించేందుకు యత్నించగా అవి తెరచుకోకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. గురువారం ఉదయం వెలుగుచూసిన సంఘటన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బ్యాంకును సందర్శించి గ్రిల్స్‌ను పరిశీలించారు. ఇదిలావుండగా బ్యాంకు అధికారులు పోలీసులకు సకాలంలో సమాచారం అందివ్వకపోవడంతో బ్యాంకు చోరీలు ఇంటి దొంగల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండ్రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన ఆంధ్రాబ్యాంక్‌లో జరిగిన చోరీకి నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము భద్రతపై ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించడం లేదని యాజమాన్యంపై కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ బ్యాంకు ప్రతినిధులతో జరిగిన సమావేశంలో హెచ్చరించారు. ఆంధ్రాబ్యాంక్ అధికారులపై కేసు నమోదు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఘట్‌కేసర్ బ్యాంక్‌లో జరిగిన చోరీ నేపథ్యంలో బ్యాంక్‌లో సెన్సర్ ఆన్ చేసి ఉందని ఒకసారి..తమ సిబ్బందికి అవగాహన లేకపోవడంతో సెన్సర్ ఆఫ్ చేశారంటూ మరోసారి పోలీసులకు నచ్చజెప్పేందుకు అధికారులు యత్నించగా కమిషనర్ సివి ఆనంద్ బ్యాంక్ అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. తాజాగా జరిగిన సెంట్రల్ బ్యాంక్ చోరీని పరిశీలిస్తే ఇంటి దొంగల పనేగా ఖాతాదారులు భావించే పరిస్థితి వచ్చిందన్నారు. బ్యాంకులు, ఏటిఎంల వద్ద భద్రత పెంచుకోవాలని, సెక్యూరిటీ లేని ఎటిఎంలను మూసేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల సొమ్ముకు భద్రత కరువైతే బ్యాంకర్లు నమ్మకం కోల్పోతారని తద్వారా ప్రభుత్వంపై చెడు ప్రభావం కలుగుతుందని కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు.