హైదరాబాద్

పొంచి ఉన్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: వర్షాకాలం కష్టాలను పూర్తిగా నివారించలేకపోయినా, భారీ వర్షాలు కురిసినపుడు ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు తాము రౌండ్ ది క్లాక్ సిద్ధంగా ఉన్నామని వివిధ ప్రభుత్వ శాఖలు ప్రకటనలు చేస్తున్నాయి. కానీ భారీగా వర్షం కురుస్తున్నపుడు ఎలాంటి సహాయం అవసరమైనా ఏ ఒక్క శాఖ అధికారులు స్పందించి ముందుకురారు. ఇది ప్రతి వర్షాకాలం ప్రభుత్వ శాఖల వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం. ప్రస్తుతం ఎండుతున్న ఎండల మాదిరిగానే ఈసారి కూడా కాస్త ముందుగానే వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే! మరోవైపేమో జూన్ మొదటి వారంలోనే నైరుతు రుతుపవనాలు వచ్చే అవకాశమున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో మరో పక్షం రోజుల్లో వర్షాకాలం ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలుసార్లు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న ప్రజలు భారీ వర్షాల సూచనతో ఎప్పుడు ఏం జరుగుతుందోనంటూ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గత సంవత్సరం భారీ వర్షాలు కురిసి నగర శివార్లలోని కూకట్‌పల్లి పరిసర ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిన సమయంలో నాలాలు, చెరువుల్లో వెలసిన ఆక్రమణలను గుర్తించేందుకు ఆగమేఘాలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించటంతో నగరంలోని 390 కిలోమీటర్ల పొడువునా అన్ని రకాల నాలాలపై దాదాపు 12వేల వరకు ఆక్రమణలున్నట్లు అధికారులు గుర్తించినా, నేటికీ వాటిలో ఒక్కదాన్ని కూడా నేలమట్టం చేయలేదు. అంతేగాక, అప్పట్లో ఒక్కరాత్రి ఏకధాటిగా కురిసిన వర్షానికి స్తంభించిన విద్యుత్ సరఫరాను నాలుగురోజులైనా పునరుద్ధరించలేదు. ఇదే పరిస్థితి రానున్న వర్షాకాలంలోనూ పునరావృతమవుతుందా? అన్న భయం ప్రజల్లో నెలకొంది. కొద్దిరోజుల క్రితం అర్ధరాత్రి ఆకస్మికంగా పది సెంటీమీటర్ల వర్షం పడి నగరం మొత్తం అతలాకుతలమైతే.. ఏ ఒక్క ప్రభుత్వ శాఖ కూడా అప్పటికపుడు సహాయక చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఈసారి నెలరోజుల ముందే తాము అప్రమత్తమై వానాకాలం కష్టాలను తగ్గించేందుకు కార్యచరణను సిద్ధం చేస్తున్నామని జిహెచ్‌ఎంసి, జలమండలి అధికారులు గొప్పగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే! కానీ ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు అధికారులు ఈ రకంగా ప్రకటనలు చేసి చేతులు దులుపుకొంటున్నారే తప్పా, క్షేత్ర స్థాయిలో చేపట్టే సహాయక చర్యలు అంతంత మాత్రమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.