హైదరాబాద్

ముగిసిన స్థారుూ సంఘ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: మహానగరంలోని కోటి మంది ప్రజలకు అందించే పౌరసేవల నిర్వహణతో పాటు కార్పొరేషన్ పరిపాలన వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించే స్థారుూసంఘం సమావేశం గురువారం జరిగింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు, అలాగే సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించే పలు ఇతర ముఖ్యమైన అంశాలకు ఆమోదం లభించినట్లు మేయర్ వెల్లడించారు. ఆమోదించిన అంశాలిలా ఉన్నాయి.
* ముషీరాబాద్ మెయిన్‌రోడ్డు నుంచి భోలక్‌పూర్ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణకు గాను బాకారంలో ఉన్న మల్లన్న టెంపుల్ భూసేకరణకు రూ. 31లక్షల 5వేలను చెల్లించేందుకు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది.
* జిహెచ్‌ఎంసి పరిధిలోని సంజీవరెడ్డినగర్, అంబర్‌పేటలో ఉన్న ఎలక్ట్రిక్ శ్మశానవాటికలను పిపిపి ప్రాతిపదికన కాంట్రాక్టు పొందిన ఎస్కో ఫర్నేనెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఒక శవ దహనానికి రూ. 4వేలుగా వసూలు చేసుకోవాలని నిర్ణయిస్తూ తీర్మానించింది.
* 1955 జిహెచ్‌ఎంసి చట్టంలోని 455(1),(2) సెక్షన్ల ప్రకారం ఇభవనాలను స్వాధీనం చేసుకునే అధికారులను జిహెచ్‌ఎంసి చట్టం 118(2) సెక్షన్ ప్రకారం చీఫ్ సిటీ ప్లాన్‌కు అప్పగించే ప్రతిపాదనలకు స్థారుూ సంఘం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
* జిహెచ్‌ఎంసిలో పనిచేస్తున్న 95 మంది సీనియర్ అసిస్టెంట్లలో ఏసిబి, ఇతర కేసులు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న ఐదుగురు మినహా మిగిలిన వారికి సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ కల్పిస్తూ వచ్చిన ప్రతిపాదనలను స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది.
* మలక్‌పేటలోని లూయిబ్రెయిలీ ఫ్లై ఓవర్ మధ్యనున్న నేషనల్ ఫ్రెండ్లీ పార్కుల్లో ఏర్పాటు చేసిన సెన్సోరీ బ్లాక్‌లను 2017-18సంవత్సరానికి నిర్వాహణకు గాను రూ. 59.15లక్షలు వికాసం విభాగానికి కేటాయిస్తూ వచ్చిన ప్రతిపాదనకు స్థారుూ సంఘం ఆమోద ముద్ర వేసింది.
* జిహెచ్‌ఎంసి పరిధిలోని మరో ఇరవై చెరువుల పునరుద్ధరణ, సమగ్రాభివృద్ధికి రూ. 401.98 కోట్ల మంజూరుకు పరిపాలన సంబంధిత ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు స్థారుూ సంఘం అంగీకారం తెలిపింది.
* జూబ్లీహిల్స్ బంజారా నాలాపై రూ. 89.39 కోట్ల వ్యయంతో రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్ కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలన సంబంధిత ఉత్తర్వులు మంజూరు కోసం వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
* సికిందరాబాద్ అదయ్యనగర్‌లో ఉన్న పాత గ్రంథాలయంను కూల్చి రూ. 3 కోట్ల వ్యయంతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ స్థారుూ సంఘం తీర్మానం చేసింది.
*