హైదరాబాద్

అర్బన్ భగీరథలో అవకతవకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రమాలకు పాల్పడ్డ మేనేజర్ సస్పెన్షన్
ముగ్గురు కాంట్రాక్టర్లపై చర్యలు
రోడ్డు మరమ్మతు పనులపై అసంతృప్తి
శివార్లలో జలమండలి ఎండి పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 26: మహానగరంలో జనజీవనంతో ముడిపడి ఉన్న ముఖ్యశాఖల అధికారులు ప్రజలకు ప్రయోజనం సమకూర్చేందుకు ఎంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా, దాన్ని అమలు తీరుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి పెట్టనిదే అవి అర్హులకు అందవన్న విషయం తేలింది. నగరంలో ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించాలన్న సంకల్పంతో జలమండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అర్బన్ భగరీథ స్కీం అమలులో అవతకవకలు వెలుగుచూశాయి. ఈ స్కీం ప్రారంభానికి ముందు నుంచే దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలను లబ్దిదారులుగా గుర్తించాలని జలమండలి ఎండి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకున్న భిన్నంగా ఉన్నట్లు జలమండలి ఎండి శివార్లలో నిర్వహించిన పర్యటనలో తేలిపోయింది. ఎండి దాన కిషోర్ శుక్రవారం నగరంలోని అల్వాల్, షాపూర్‌నగర్‌లలో పర్యటించి అర్బన్ భగీరథ కార్యక్రమం అమలు, అలాగే హడ్కో నిధులతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పనులు, ఈ పనుల్లో భాగంగా పైప్‌లైన్ విస్తరణ కోసం తవ్విన రోడ్లకుమరమ్మతుల పనులను ఆయన క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. అర్బన్ భగీరథ స్కీం కింద కేవలం ఒక రూపాయికే నల్లా కనెక్షన్‌ను మంజూరు చేయటంలో ఎం.ఈశ్వరయ్య అనే షా పూర్‌నగర్ మేనేజర్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఎండి ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే నల్లా కనెక్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు గ్రీన్ బ్రిగేడ్ కాంట్రాక్టర్లు కోదండరామారావు, బి. రాజు, తౌసిఫ్ అలీలను బ్లాక్ లిస్టులో చేర్చాలని అధికారులను ఆదేశించారు. మరో వైపు పైప్‌లైన్ విస్తరణ కోసం తవ్విన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన ఎండి పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. అయితే పనులు చేపట్టే ప్రాంతంలో పనులు జరుగుతున్నట్లు బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, సదరు కాంట్రాక్టరు ఎలాంటి చర్యలు చేపట్టకుండానే పనులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఎండి దాన కిషోర్ ఆ కాంట్రాక్టర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎండి అల్వాల్‌లో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఇన్‌లెట్, ఔట్‌లెట్ పనులు, రిజర్వాయర్ సుందరీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఫాదర్ బాలయ్యనగర్‌లో పర్యటించిన ఎండి అర్బన్ భగరీథ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇస్తున్న నీటి కనెక్షన్లను తనిఖీ చేశారు. ఈ కనెక్షన్లు మంజూరు చేయటంలో, నల్లా కనెక్షన్లు ఇవ్వటంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అని స్థానికులను అడిగి తెల్సుకున్నారు. ఇందుకు స్పందించిన కొందరు వినియోగదారులు గ్రీన్ బ్రిగేడ్ కాంట్రిక్టర్లు గుంత తీయటానికి డబ్బులు తీసుకున్నారని ఎండి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎండి సదరు కాంట్రాక్టర్‌ను పనుల నుంచి తప్పించి, వినియోగదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి వారికే ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జలమండలి సిజిఎంలు ప్రవీణ్‌కుమార్, ఎం.బి. ప్రవీణ్‌కుమార్‌లతో పాటు జిఎంలు, డిజిఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.
సకాలంలో పూర్తి చేయాలి
శివార్లకు కూడా తాగునీటిని అందించేందుకు వీలుగా చేపట్టిన హాడ్కో తాగునీటి ప్రాజెక్టులో భాగంగా షాపూర్‌నగర్‌లో నిర్మిస్తున్న రిజర్వాయర్‌ను తనిఖీ చేసిన ఎండి సకాలంలో ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు మరమ్మతుల పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి సూచిక బోర్డుల్లేకుండా పనులు జరుగుతున్న తీరును పరిశీలించి ఎండి సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించారు. ఇలాంటి చర్యలు తిరిగి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.