హైదరాబాద్

విపత్తుల నివారణకు ప్రత్యేక వాలంటీర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విపత్తుల సంభవించినపుడు వాటిని వెంటనే గుర్తించి, సకాలంలో స్పందించి ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యేక వాలంటీర్లను నియమించనున్నట్లు మహానగర పాలక సంస్థ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి వెల్లడించారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ సభ్యులు లెఫ్‌ట్‌నెంట్ జనరల్ ఎన్‌సి మార్వా గురువారం జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రేటర్‌లో హైదరాబాద్‌లో విపత్తుల నివారణకు చేపట్టిన చర్యలు కమిషనర్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఐదు రకాల విపత్తులు ఏర్పడే అవకాశముందని, వీటిలో రసాయనిక పరిశ్రమలు, ఎన్‌ఎఫ్‌సి, అగ్నిప్రమాదాలు, వరదలు వంటివి ఉన్నాయన్నారు. ఆకస్మికంగా సంభవించే ఈ విపత్తులను ఎదుర్కొనేందుకు జిహెచ్‌ఎంసిలో ప్రత్యేకంగా యంత్రాంగం ఉందని, అయినప్పటికీ నగరంలో ప్రత్యేకంగా విపత్తుల సందర్భంగా తక్షణమే స్పందించేందుకు వీలుగా వాలంటీర్లను ఎంపిక చేసి వారికి శిక్షణనిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం భూకంప రహిత సేఫ్‌జోన్‌లో ఉందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన పనులపై ప్రధానంగా అపార్ట్‌మెంట్‌లలోని వ్యక్తులకు శిక్షణనివ్వాల్సిన అవసరముందని, ఎమర్జెన్సీలో చేపట్టే పనులను జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో కూడా అందరికీ తేలిపేలా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మూసీ నది మార్గం మొత్తంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉన్నాయని, భారీ వర్షాలు కురిసినపుడు వరదలతో ఈ ఆక్రమిత ఇళ్లకు ప్రమాదం ఏర్పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో వాతావరణ పరిస్థితులను ప్రతి మూడు గంటలకు ఒక నివేదిక ఇస్తుందని, వీటి ఆధారంగా ఏ విధమైన విపత్తులు ఏర్పడినా సమయంలో పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం జరుగుతోందని తెలిపారు. భారీ వర్షాల సందర్భంగా నగరంలో నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించామని వివిరంచారు. అనంతరం విపత్తుల నివారణ సంస్థ సభ్యులు మార్వా మాట్లాడుతూ ఎన్‌డిఏంఏకు చెందిన 40 మంది సభ్యుల బృందం షేక్‌పేటలో ప్రత్యేకంగా ఉంచటం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో విపత్తుల నిరోధక కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. భవనాలు, ఆకస్మికంగా కూలిపోవటం, అగ్నిప్రమాదాలు సంభవించటం, ఆకస్మిక వరదల వల్ల ఏర్పడే విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రుల్లో నీటి సరఫరాను పరిశీలించాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకార్యం కలుగకుండా స్వచ్చమైన నీరు సరఫరా అయ్యోలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జలమండలి ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేవ్వరరావు ఆదేశించారు.
గురువారం డైరెక్టర్ ఇతర అధికారులతో కలిసి వివిధ ఆసుపత్రులకు సరఫరా అవుతున్న నీటిని పరిశీలించారు. జలమండలి పరిధిలోని అన్ని డివిన్‌లలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులకు సంబంధించిన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న నీటిలో ఎలాంటి లోపాలు ఏర్పాడిన సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.