హైదరాబాద్

ఉప్పల్ రహదారి విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 27: ఉప్పల్ ప్రధాన రహదారి విస్తరణ, అభివృద్ధితో పాటు ఎలివేటెడ్ కారిడార్ పనుల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. రెండు, మూడు రోజుల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర మంత్రుల చేతుల మీదుగా కారిడార్ పనులకు శంకుస్థాపన చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి ఘట్‌కేసర్ నారపల్లి నందనవనం వరకు 6.5 కిలో మీటర్ల వరకు కారిడార్ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 950 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ పనులు ప్రారంభమైతే నగరంలో నుంచి నాగోల్, అంబర్‌పేట వైపు నుంచి వచ్చే వాహనాలను హెచ్‌ఎండిఏలో చేపట్టిన వంద అడుగుల సర్వీస్ రోడ్డు మీదుగా పీర్జాదిగూడ కమాన్, తార్నాక, హబ్సిగూడ నుంచి నాచారం మీదుగా హేమానగర్, మాణిక్‌చంద్ కంపెనీ మీదుగా బోడుప్పల్, చెంగిచర్ల వరంగల్ రహదారికి ట్రాఫిక్‌ను మళ్లించాలని అధికారులు భావిస్తున్నారు. విస్తరణ పనులతో నష్టపోయిన వారికి నష్టపరిహారం సైతం ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. పూర్తిగా స్థలం పోతే బదులుగా మరొక చోట స్థలాన్ని ఇవ్వాలన్న విషయంలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.