హైదరాబాద్

మీట నొక్కితే చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇప్పటి వరకు ఒక క్లిక్‌తో తన పరిధిలోని అన్ని రకాల సేవలను అందిస్తున్న జిహెచ్‌ఎంసి ఇకపై ఇతర విభాగాల సేవలను కూడా నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ నగరవాసులు ఇంట్లో నుంచే అన్ని రకాల సేవలు పొందాలన్న సంకల్పంతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలు ఇతర శాఖలతో ముడిపడి ఉన్నందున, సంబంధిత శాఖల అధికారులతో సంప్రదింపులు జరపటం, వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించటం వంటి వాటితో ఎక్కువ సమయం వృధా అవుతుండటంతో జిహెచ్‌ఎంసి అధికారులు అన్ని ప్రభుత్వ శాఖలను కలుపుతూ ఓ పోర్టల్‌ను తయారు చేసేందుకు సిద్ధమైంది.
తొలుత దీన్ని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్‌ఐసి) ద్వారా రూపకల్పన చేయించాలని భావించింది. కానీ అన్ని ప్రభుత్వ శాఖలను కలుపుతూ పోర్టల్ తయారీ చేసేందుకు ఆ శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవల్సి ఉందని తేల్చి చెప్పటంతో రాష్ట్ర ఐటి శాఖ అధికారులతో గ్రేటర్ అధికారులు సంప్రదింపులు జరిపారు. జిహెచ్‌ఎంసి ప్రధాన వారధిగా అన్ని ప్రభుత్వ శాఖలను ఓ పోర్టల్ పరిధిలోకి తీసుకువచ్చే దిశగా ప్రస్తుతం ఈ రెండు శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతేగాక, వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో ఈ పోర్టల్ అంశాన్ని పొందుపర్చినట్లు అధికారులు చెబుతున్నారు.
తొలుత జిహెచ్‌ఎంసి ద్వారా..
ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల సేవలను జిహెచ్‌ఎంసి ద్వారాఓ పోర్టల్ పరిధిలోకి తీసుకువచ్చి, ఆయా శాఖల మధ్య సమాచారం షేర్ చేసుకోవటం, ఫైళ్ల నిర్వహణ వంటి అంశాలు మెరుగుగా కొంతకాలం నిర్వహించిన తర్వాత అవసరమైతే మరికొంత కాలం జిహెచ్‌ఎంసి ద్వారా అడ్మినిస్ట్రేటర్‌ను మెయింటైన్ చేస్తూ సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు యోచిస్తున్నారు.
ఫిర్యాదులు..సేవలు ఇలా!
త్వరలోనే జిహెచ్‌ఎంసి ద్వారా అందుబాటులోకి రానున్న ఈ పోర్టల్ ద్వారా నగర వాసులు ఇంట్లో కూర్చొని ఈ పోర్టల్‌లోకి లాగిన్ అయి తమకు కావల్సిన సేవలను ఎంచుకుని, ఇవ్వాల్సిన ఫిర్యాదులను సమర్పిస్తే, అవి సంబంధిత విభాగాధిపతికి చేరేలా ఈ పోర్టల్‌ను డిజైన్ చేస్తున్నారు. ఆయన ఆ పని ఏ స్థాయి అధికారుల పరిధిలో ఉందో గుర్తించి, అక్కడకు పంపి, అందుకు నిర్ణీత గడువును కూడా నిర్ణయిస్తారు. ఆ తర్వాత తానిచ్చిన ఫిర్యాదు గానీ, అభ్యర్థించిన సేవల కోసం సమర్పించిన ఆర్జీ ఏ స్థాయిలో ఉందో సామాన్య ప్రజలు కూడా తెల్సుకునే విధంగా దీన్ని రూపకల్పన చేస్తున్నారు. తొలి దశగా ఆయా ప్రభుత్వ శాఖల మధ్య ప్రారంభమయ్యే ఈ పోర్టల్ ఆ తర్వాత ఆయా శాఖల మధ్య జరుగుతున్న ఫైళ్ల నిర్వహణతో పాటు ప్రజల ఆర్జీలు, ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా వీక్షించేందుకు వీలుగా ఈ పోర్టల్ రూపుదిద్దుకుంటున్నట్లు గ్రేటర్ అదనపు కమిషనర్ సురేంద్ర మోహన్ తెలిపారు.

వల వేయండి!

బిపిఎస్, ఎల్‌ఆర్‌ఎస్
క్రమబద్ధీకరణలో పారదర్శకత
ఏసిబికి మంత్రి కెటిఆర్ ఆదేశం
బల్దియా అక్రమార్కుల గుండెల్లో దడ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 4: బల్దియా అంటేనే ఖాయా పీయా చల్దియా అంటూ ప్రజల్లో ముద్రపడిన మహానగర పాలక సంస్థలోని అవినీతిని రూపుమాపేందుకు మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు నడుం భిగించారు. ఇప్పటి వరకు ఎంతో మంది మంత్రులు, కమిషనర్లు ఇక్కడి అవినీతిని రూపుమాపేందుకు చేసిన అనేక ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. కానీ ఇపుడు తాజాగా మన యువ మంత్రి వినూత్నమైన తరహాలో తన ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ అవినీతిని అడ్డుకోవాలని అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్, ఎల్‌అర్‌ఎస్ స్కీంలలో ఏ విధమైన అవకతవకలు జరగరాదన్న ఉద్దేశ్యంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పవచ్చు. గత సంవత్సరం అక్టోబర్ 28వ తేదీకి ముందు నిర్మితమైన అనధికార భవనాలు, అక్రమ లే అవుట్లను మాత్రమే క్రమబద్ధీకరించాలన్నది ఈ స్కీంల ప్రధానోద్దేశ్యం. అయితే కటాఫ్ తేదీ దాటిన తర్వాత కూడా పలు చోట్ల అక్రమ నిర్మాణాలు బయటపడటంతో జిహెచ్‌ఎంసి పనితీరుపై అవినీతిపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పవచ్చు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు వచ్చేందుకు టౌన్‌ప్లానింగ్ అధికారుల కూడా సహాయ పడుతున్నట్లు మంత్రి నివేదికలు తెప్పించుకున్నారు. అందుకే ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ స్కీంల క్రమబద్ధీకరణల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా, అవినీతికి తావులేకుండా గట్టి చర్యలు చేపట్టాలని మంత్రి కెటిఆర్ ఎసిబి డైరెక్టర్ ఎ.కె.ఖాన్‌తో మాట్లాడినట్లు సమాచారం. గతంలో 2007 నుంచి 2008 మధ్య అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ పథకాన్ని ఆసరాగా చేసుకుని 2010లో కూడా అక్రమంగా నిర్మించిన భవనాలను కూడా పెద్ద ఎత్తున క్రమబద్ధీకరించినట్లు మంత్రి దృష్టికి వెళ్లింది. ఈ విషయంలో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఈ సారి కూడా అదే విధంగా చేసేందుకు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది సిద్ధమైందన్న సమాచారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కూడా అందినట్లు సమాచారం. క్రమబద్ధీకరణలో పారదర్శకత కోసం గత సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన తీసిన జిపిఎస్‌తో పాటు శాటిలైట్ చిత్రాల ఆధారంగా అపుడు ఉన్న భవనాలు ఎన్ని ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చిన భవనాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలుగా గుర్తించాలని మంత్రి కెటిఆర్ ఏసిబి అధికారులకు సూచించినట్లు సమాచారం.
జాగ్రత్తలు తీసుకోండి
జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ కమిషనర్లకూ ఆదేశం
ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ పకడ్బందీగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ కమిషనర్లు డా.బి. జనార్దన్ రెడ్డి, చిరంజీవులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. అక్రమాలను అరికట్టేందుకు ఏసిబితో పాటు అవసరమైతే విజిలెన్స్‌ను కూడా రంగంలో దించనున్నట్లు మంత్రి కెటిఆర్ భావిస్తున్నారు. ఈ విషయంలో ఏసిబికి అందే ప్రతి ఫిర్యాదును అధికారులు సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
టెట్, డిఎస్సీలను వెంటనే నిర్వహించాలి
తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్షను వాయిదా వేయడం ద్వారా డిఎస్సీని కాలయాపన చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి కూడా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా కుట్ర చేస్తోందని గిరిజన సంఘం తెలంగాణ కమిటీ ఆరోపించింది. వెంటనే టెట్ పరీక్షను, డిఎస్సీ నిర్వహించేందుకు ప్రకటించాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ శోభన్‌నాయక్, మూడ్ ధర్మనాయక్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.
జి.వో 51 ప్రకారం ప్రతి ఆరు నెలలకు టెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఇప్పుడు సమీక్ష కమిటీ చెప్పిందని చెప్పి టెట్‌ను వాయిదా వేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. టెట్, డిఎస్సీ నిర్వహించడం ఇష్టం లేకనే చవకబారు సాకులు చెబుతున్నదని తెలిపారు. కెజి టు పిజి అమలు కోసమైనా ఉపాధ్యాయ పోస్టులు అవసరమన్న సంగతి గుర్తించి టెట్, డిఎస్సీలను నిర్వహించాలని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

పర్మిట్ రాజ్ విధానం ఎత్తివేత
ప్రతిపాదనకు నిరసన
10న అన్ని డిపోల
వద్ద ప్రదర్శన
ప్రకటించిన తెలంగాణ ఆర్టీసి స్ట్ఫా, వర్కర్స్ యూనియన్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 4: ప్రైవేటు రవాణా రంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు గాను పర్మిట్ రాజ్ విధానాన్ని ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసి స్టాప్, వర్కర్స్ ఫెడరేషన్ తెలిపింది. కేంద్రం పర్మిట్‌రాజ్ రద్దు పేరుతో ఆర్టీసిలకు మరణ శాసనం రాసే ప్రయత్నం చేస్తోందని ఫెడరేషన్ అధ్యక్షుడు సిహెచ్ రాంచందర్, ప్రధానకార్యదర్శి విఎస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. 1977లో జాతీయం చేయబడిన రూట్లలో ఆర్టీసిలకు గుత్తాదిపత్యం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేస్తే ఇప్పుడు మళ్లీ పర్మిట్లు రద్దు చేయడం ద్వారా చట్ట సభలు చేసిన నిర్ణయాలను కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని వారు దుయ్యబట్టారు. ఈ నేపధ్యంలో కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 10న తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆర్టీసి డిపోల వద్ద ప్రదర్శనలు, ధర్నాలు జరపాలని స్ట్ఫా, వర్కర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.

ఆర్‌టిఎ అధికారి నరేందర్ ఇంట్లో ఏసిబి సోదాలు
సుమారు రూ.5కోట్ల ఆస్తుల గుర్తింపు
రూ.22లక్షలు నగదు, 60తులాల బంగారం స్వాధీనం

హైదరాబాద్, మార్చి 4: రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో అడ్మినిస్ట్రేటీవ్ అధికారిగా పనిచేస్తున్న జె.నరేందర్‌ను గత నెల రోజుల క్రితం ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టు బడ్డాడు. ఈ క్రమంలో ఎసిబి పోలీసులు గురువారం తెల్లవారు జాము నుండి నగరంలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి విలువైన అస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్‌పి స్థాయి అధికారితో కూడిన బృందం నగరంలోని నరేందర్‌కు సంబంధించిన గాంధీనగర్, ఫీల్‌ఖానాతో పాటు అతని బందువుల ఇళ్లలో కూడా ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. నెల రోజుల క్రితం నరేందర్ ఎసిబికి చిక్కిన కేసులో సస్పెండ్ చేశారు. దాదాపు రూ.5కోట్ల విలువ చేసే అస్తులున్నట్లు ఎసిబి అధికారులు తనిఖీల్లో గుర్తించారు. నరేందర్ ఇంటి నుండి రూ.22 లక్షల నగదు, 60 తులాల బంగారు అభరణాలు, వివిధ ప్రాంతాల్లో మూడు ఇళ్ల ప్లాట్స్ కూడా ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు.