హైదరాబాద్

సిటీ మొత్తం ‘ఫ్రీ వైఫై’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: ఆధునిక సాంకేతిక రంగాన్ని అన్నివర్గాల ప్రజలకు అందుబాటులోకి తేచ్చేందుకు ప్రభుత్వ ప్రయత్నం మరో అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉన్నా, అది సక్రమంగా పనిచేయకపోవటంతో ప్రభుత్వం మంగళవారం ‘హైదరాబాద్ సిటీ వైఫై ప్రాజెక్టు’ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును నగర మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద నగరంలోని నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే వెయ్యి ప్రాంతాలను ఎంపిక చేసి వాటిని హాట్ స్పాట్‌లుగా గుర్తించినట్లు వెల్లడించారు. నగరం మొత్తం ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మూడు వేల ప్రాంతాలను హాట్ స్పాట్‌లుగా రాష్ట్ర ఐటి శాఖ గుర్తించిందని, ఇందులో భాగంగానే తొలి దశగా వెయ్యి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రాంతాల్లో వైఫై వినియోగం తొలి అరగంట సేపు ఉచితంగా ఐదు నుంచి పది ఎంబిపిఎస్ ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి వస్తాయని వివరించారు. మిగిలిన మరో రెండు వేల ప్రాంతాల్లో రానున్న మూడు నెలల్లో హాట్ స్పాట్‌లుగా తీర్చిదిద్ది ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. నగరంలో ఇదివరకే ఫ్రీ వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాత్మంగా ప్రాజెక్టును చేపట్టినట్లు, అది సత్ఫలితాలిచ్చినందుకే సేవలు మొత్తం నగరం విస్తరించేందుకు ప్రభుత్వం రూ. 300 కోట్లను వెచ్చిస్తోందని మేయర్ వివరించారు. 2015 జూన్ మాసంలో ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని నగరాలన్నింటిని ఐటి సేవల పట్ల ఒకే గొడుగు కిందకు తీసుకవచ్చేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ దశల వారీగా ఈ ప్రాజెక్టును వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలకు కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్రీ వైఫై సేవలను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు గాను నైపుణ్యత కల్గిన సంస్థలతో ఓ ఎంపానల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం నగరంలోని 3వేల ప్రాంతాల్లో ఒకేసారి వైఫై సేవలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు, ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలు సేవలను వినియోగించుకునేందుకు వీలుగా సెల్యూలార్ ఆపరేటర్ అసొసియేషన్ ఆఫ్ ఇండియా సహాయసహకారాలు అందిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ వెల్లడించారు.

రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక బృందాలు

* ఇప్పటి వరకు 8250 గుంతల పూడ్చివేత
*తరచూ వర్షాలతో మళ్లీ గుంతలు
*తాత్కాలిక ఉపశమనం కోసమే ఏర్పాట్లు

హైదరాబాద్, జూన్ 20: అసలే వర్షాకాలం..ఓ మోస్తారు వాన పడిందంటే చాలు.. రోడ్లు కొట్టుకుపోతుంటాయి. పైగా అందులో నీరు నిల్వటంతో గుంతలు కన్పించకుండా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి పరిస్థితులను అదుపు చేసేందుకు జిహెచ్‌ఎంసి సరికొత్త కార్యచరణను సిద్దం చేసింది. తరుచూ జల్లులు కురవటంతో రోడ్లపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చేందుకు ప్రత్యేకంగా 120 అత్యవసర బృందాలను ఏర్పాటు చేసింది. గుంతలను ప్రతిరోజు పూడుస్తున్నా, చిన్నపాటి వర్షానికి అందులోని బిటి, సిసి మిశ్రమం కొట్టుకుపోవటంతో మళ్లీ గుంతలు ఏర్పడుతున్నట్లు గుర్తించిన జిహెచ్‌ఎంసి ఎప్పటికపుడు గంతలు ఏర్పడగానే అప్పటికపుడే వాటిని పూడ్చేందుకు ఈ బృందాలను రంగంలో దింపింది. గత ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి వరకు సుమారు 8250 గుంతలను పూడ్చిన జిహెచ్‌ఎంసి ఇంకా రోడ్లపై కన్పించే గుంతలను పూడ్చటమే సింగిల్ పాయింట్ పనిగా ఈ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఒక్కో బృందంలో ఇద్దరు కార్మికులతో పాటు సిమెంటు, ఇసుక, ఇతర నిర్మాణ సామాగ్రిలు ఉంటాయి. నగరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8496 గుంతలు ఏర్పడినట్లు గుర్తించగా, ఇందులో 8256 గుంతలను పూడ్చివేసినట్లు అధికారులు తెలిపారు. మరో 240 గుంతలను పూడ్చివేయాలని బృందాలను ఆదేశించారు. సౌత్ జోన్‌లో 2401 గుంతలుండగా, సెంట్రల్ జోన్ 2025, ఈస్ట్‌జోన్‌లో 1487, నార్త్‌జోన్‌లో రి1940 గుంతలు ఏర్పడగా, అన్నింటి కన్నా తక్కువ వెస్టుజోన్‌లో 821 గుంతలను గుర్తించారు. వీటిలో అత్యధికంగా గుంతలు మెట్రోరైల కారిడార్‌లోనే ఏర్పడినట్లు గుర్తించారు. ప్రధానంగా ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకున్న కారిడార్‌లోనే గుంతలెక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడు జలమండలి ద్వారా మంచినీటి సరఫరాకు 1800 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్ల తవ్వకానికి అనుమతి ఇవ్వటం, సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా సిసి కెమెరాల ఏర్పాట్లు వంటి ఇతరాత్ర అత్యవసర పనుల కోసం రోడ్లతవ్వకానికి జిహెచ్‌ఎంసి అనుమతివ్వాల్సి వచ్చింది. నగరంలో గత పదిరోజులుగా కురుస్తున్న వరుస జల్లుల కారణంగా రోడ్లపై పెద్ద ఎత్తున గంతలు ఏర్పడటంతో అధికారులు ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదార్లపై ఏర్పడిన గోతులను యుద్దప్రాతిపదికపై పూడ్చటానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ లింకురోడ్డుపై ఏర్పడే గుంతలను పూడ్చటంలో కొంత ఆలస్యమవుతోందని అధికారులు బహాటంగానే చెబుతున్నారు. ఈ బృందాలు రోడ్లపై గుంతలను పూడ్చటం, వానల వల్ల మునిగే ప్రాంతాలను క్లియర్ చేయటం, కూలిన చెట్లను తొలగించటం వంటి పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

పండ్ల గోదాములపై ఎస్‌ఓటి పోలీసులు దాడి
గచ్చిబౌలి, జూన్ 20: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే కెమికల్స్ వాడవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కొందరు వ్యాపారులు తమ స్వార్ధం కోసం హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మగ్గబెడుతున్నా గోడౌన్‌పై ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసి కెమికల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఎండి హకీల్(40), సయ్యద్ షాహేబ్ అలీ (45) పండ్ల వ్యాపారులు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు హాని కలిగించే కెమికల్ పౌడర్‌ను మామిడి కాయలు మగ్గడానికి వినియోగిస్తున్నారు. ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసి కెమికల్స్‌ని స్వాధీనం చేసుకుని నిర్వహకులను విచారణ నిమిత్తం మాదాపూర్ పోలీసులుకు అప్పగిచారు. మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.