హైదరాబాద్

సోషల్ మీడియా వినియోగంలో బల్దియా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా జిహెచ్‌ఎంసి ప్రవేశపెట్టిన ట్విట్టర్‌కు నగరవాసుల నుంచి స్పందన భేష్‌గా వస్తోంది.
జిహెచ్‌ఎంసి ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న వారి సంఖ్య 20వేలు దాటినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అత్యధిక మంది ఫాలో అవుతున్న స్థానిక సంస్థల ట్విట్టర్ స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ అనంతరం ఐటి రాజధానిగా పేరుగాంచిన బెంగుళూర్ కార్పొరేషన్ ట్విట్టర్‌కు కేవలం 10వేల 55 మంది మాత్రమే ఫాలో అవుతుండగా, జిహెచ్‌ఎంసి ఇటీవలే ఏర్పాటు చేసిన ట్విట్టర్‌కు తక్కువ సమయంలో ఏకంగా 20 వేల పై చిలుకు ఫాలోవర్లు కావటం విశేషం. ఆ తర్వాత పూణే కార్పొరేషన్ ట్విట్టర్‌కు 6502 మంది, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ట్విట్టర్‌కు 1812 మంది, భువనేశ్వర్ కార్పొరేషన్‌కు 1274 మంది ఫాలోవర్లున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ట్విట్టర్ ఖాతాకు సైతం కేవలం 793 మంది ఫాలోవర్లుండగా, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ట్విట్టర్‌కగు 448 మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే జిహెచ్‌ఎంసి మేయర్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు ప్రత్యేక ట్విట్టర్ అకౌంట్లను ఓపెన్ చేసి, ముమ్మరంగా వినియోగిస్తున్నారు. అలాగే జిహెచ్‌ఎంసి ఫేస్‌బుక్‌కు సైతం అధికారులు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ మంది ఫ్రెండ్స్‌గా ఉన్నారు. సుమారు 38వేల 934 మంది ఫాలో అవుతున్నారు. అయితే మన కన్నా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫేస్‌బుక్‌కు 45వేల 402 మంది ఫాలో అవుతున్నందున అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అహ్మదాబాద్ గ్రేటర్ హైదరాబాద్‌ల తర్వాత న్యూ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఫేస్‌బుక్‌ను 23వేల 160 మంది ఫాలో అవుతుండగా, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఫేస్‌బుక్‌ను 12వేల 494 ఫాలో అవుతున్నారు.
‘సోషల్’ ఫిర్యాదుల్లో 95 శాతం పరిష్కారం
నగరంలోని పలు సమస్యలకు త్వరితగతిన పరిష్కారం సమకూర్చేందుకు జిహెచ్‌ఎంసి అందుబాటులో ఉంచిన వివిధ రకాల సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు 95 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
మై జిహెచ్‌ఎంసి యాప్ ద్వారా గత సంవత్సరం 2016 జూలై నుంచి రెండురోజుల క్రితం ఆగస్టు 13వరకు 44 విభాగాలకు సంబంధించిన 64వేల 651 ఫిర్యాదులు అందగా, వీటిలో 62వేల 139 ఫిర్యాదులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఫిర్యాదుల్లో భారీ బడ్జెట్ అవసరమైన, ఇతర శాఖల సమన్వయంతో పరిష్కరించాల్సిన ఫిర్యాదులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు జిహెచ్‌ఎంసిలోని 27 సెక్షన్లకు సంబంధించి 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 ఆగస్టు 13వ తేదీ వరకు లక్షా 10వేల 323 ఫిర్యాదులు అందగా, వీటిలో లక్షా వెయ్యి 166 ఫిర్యాదులను పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. 92.15శాతం ఫిర్యాదులను పరిష్కరించామని వివరించారు. వీటిలో 8వేల 657 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.