హైదరాబాద్

ఆధునిక కవిత్వానికి వేగుచుక్క గురజాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, సెప్టెంబర్ 21: ఆధునిక కవిత్వానికి వేగుచుక్క గురజాడ అని పలువురు వక్తలు అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా సినీ సంగీత విభావరి కార్యక్రమం శ్రీత్యాగరాయ గానసభలోని కళా లలిత కళావేదికలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి సాహితీవేత్త రావులపాటి సీతారామారావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి, ప్రముఖ సాహితీవేత్త డా.ద్వానా శాస్ర్తీ, రచయిత్రి డా.కెబి లక్ష్మి పాల్గొని గురజాడ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్ర్తిలకు సమాజంలో వ్యక్తిత్వం ఉండాలని అనేక రచనలు చేశారని కొనియాడారు. కన్యాశుల్కం తొలి సంఘిక హాస్య నాటకం ఎంతో అదరణ పొందిందాని అన్నరు. సభకు ముందు గాయకులు అలపించిన సినీ సంగీత విభావరి అందరని అలరించాయి.

ఆకట్టుకున్న ‘నృత్యోత్సవాలు’
కాచిగూడ, సెప్టెంబర్ 21: దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కారించుకుని శ్రీ సచ్చిదానంద కళా పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బాల సచ్చిదానందం చిన్నారులచే ‘నృత్యోత్సవాలు’ గురువారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని నృత్యోత్సవాలను ప్రారంభించి ప్రసంగించారు. బాల కళాకారులు దేశ సాంస్కృతికి సంపాద అని కొనియాడారు. దేవి నవరాత్రులను సందర్భంగా తొమ్మిది రోజుల పాటు నృత్యోత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వైజ్‌మెన్ సంస్థల అధ్యక్షుడు వైఎస్‌ఆర్ మూర్తి, రచయిత్రి శైలజ మిత్రా, సంస్థ అధ్యక్షుడు రత్నాకర శర్మ పాల్గొన్నారు. సభకు ముందు నృత్య గురువు వాణి రమణ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యలు ఆకట్టుకున్నాయి.