హైదరాబాద్

‘మెట్రో’ పార్కింగ్ కోసం ప్రత్యేక పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పిపిపి ప్రాతిపదికన నిర్మించి, ఎంతో ప్రతిష్టాత్మకమైన అరుదైన ప్రాజెక్టు మెట్రోరైలు అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఎంతో ఆత్యాధునికమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన వౌలిక వసతులను కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అంతేగాక, మెట్రో స్టేషన్ల ఆవరణల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు గాను త్వరలోనే ప్రత్యేక పార్కింగ్ పాలసీని అమలు చేయనున్నట్లు తెలిపారు. గురువారం ఆయన సికిందరాబాద్ మెట్రో స్టేషన్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సికిందరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే మెట్రోరైలు వేళలను సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి,పోయే రైళ్ల రాకపోకలతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. దీంతో సుదూర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానాలను ఎంతో భద్రంగా, తక్కువ ఛార్జీలకే సురక్షితంగా చేరుకునే వెసులుబాటు కల్గుతుందన్నారు. మెట్రో స్టేషన్లకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని ప్రయాణికులను స్టేషన్‌కు తీసుకువచ్చేందుకు వీలుగా మెట్రో రైలు ఆధ్వర్యంలో మినీ బస్సులు వంటి ఎకో ఫ్రెండ్లీ వాహనాలను నడుపనున్నట్లు, దీనికి తోడు ఓలా, ఉబర్ వంటి ప్రైవేటు సంస్థలు కూడా వాహనాలను అందుబాటులో ఉంచేలా చర్చలు జరుపుతామన్నారు. నేటికీ కూడా మెట్రోరైలుపై అనేక ఆపోహాలు, అనుమానాలున్నాయని, వాటన్నింటికి చెక్ పెట్టేలా ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మెట్రో కారిడార్ కింద సెంట్రల్ మీడియా భారీగా నిర్మించారంటూ అనుమానాలు వస్తున్నాయని, వాటన్నింటికి చెక్ పెట్టేందుకు వీలుగా మెట్రో కారిడార్లలోని 34 ప్రాంతాల్లో త్వరలోనే మల్టీలెవెల్ పార్కింగ్‌లను, ఫుటోవర్ బ్రిడ్జిలను, స్కై వేలను నిర్మించనున్నట్లు తెలిపారు. కాగా, మెట్రోరైలు ఛార్జీలపై త్వరలోనే స్పష్టత ఇస్తామని, దీనిపై జిఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందోనన్న అంశంపై నిపుణులతో చర్చించనున్నట్లు కెటిఆర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పదిరోజుల్లో మియాపూర్ సందర్శిస్తా
మరో పదిరోజుల్లో మియాపూర్ మెట్రో యార్డును సందర్శిస్తానని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతో పాటు ప్రస్తుతం అమీర్‌పేటలోని మైత్రివనం వద్ధ శరవేగంగా పనులు జరుగుతున్న ఇంటర్ ఛేంజ్ మెట్రో స్టేషన్ పనులను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ స్టేషన్ పూర్తి కాగానే రెండు కారిడార్ల నుంచి వచ్చే రైళ్లు ట్రాక్ మారే ప్రక్రియ, ప్రయాణికులకు ఆ స్టేషన్‌లో కల్పించిన సౌకర్యాలను ప్రత్యేకంగా వివరించనున్నట్లు మంత్రి తెలిపారు.