హైదరాబాద్

గాంధీ జయంతికి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: గాంధీ జయంతిని పురస్కరించుకుని బాపూఘాట్‌లో ఆహ్లాదకరంగా, చూడగానే ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ నిఖిల పర్యాటక శాఖ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం టూరిజం, రెవెన్యూ, పోలీసు, జిహెచ్‌ఎంసి, అగ్నిమాపక, విద్యా, సమాచార, జలమండలి, రోడ్లు, భవనాలు తదితర శాఖల అధికారులతో కలిసి లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఏర్పాట్లపై సమీక్షిస్తూ బాపూఘాట్ ఆవరణలో పిచ్చిగా పెరిగిన గడ్డి మొక్కలను ఒక క్రమపద్దతిలో అందంగా కన్పించేలా కత్తరించాలని సూచించారు. గాంధీ విగ్రహం చుట్టుపక్కల పూలతో అలంకరించాలన్నారు. పూలకుండీలను కూడా సమృద్ధిగా క్రమపద్దతిలో పెచట్టాలని, ముఖ్యంగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్‌లు ఆసీనులయ్యే ప్రాంతాల్లో పూలకుండీలను ఉంచాలని సూచించారు. మొత్తం బాపూఘాట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో టూరిజం ఎస్టేట్ ఆఫీసర్ మదన్‌మోహన్, వాటర్ బోర్డు నుంచి సయ్యద్ సజ్జద్, హార్టికల్చర్ అసిస్టెంటు డైరెక్టర్ రాధాకృష్ణ, ఆర్డీవో చంద్రకళ, తహిసిల్దార్ అయ్యప్ప, డివిజన్ ఫైర్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్‌రెడ్డి, టూరిజం డిప్యూటీ మేనేజర్ సిహెచ్.శ్రీ్ధర్‌రెడ్డి, ఎస్పీహెచ్‌వో సుధా, అనురాధ, సమాచార శాఖ ఈడి అనంతం, ఏడి రమాదేవీ తదితురులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రంగారెడ్డి జిల్లాలోని 187 మద్యం దుకాణాలకు ఆహ్వానించిన టెండర్‌లు లాటరీల పద్ధతిలో దుకాణాల కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యింది. సరూర్‌నగర్, శంషాబాద్ డివిజన్‌ల పరిధిలో 3300ల పైచిలుకు టెండర్లను పరిశీలించిన అధికారులు లాటరీల పద్ధతిలో శుక్రవారం దుకాణాలను ఖరారు చేశారు. సరూర్‌నగర్ డివిజన్‌లో నలుగురు మహిళలు, శంషాబాద్ డివిజన్‌లో ఓ మహిళకు మద్యం దుకాణాలు దక్కాయి. టెండర్‌ల ఆహ్వానం లాటరీల పద్ధతిలో ఖరారు ప్రక్రియ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు పర్యవేక్షణలో పూర్తయ్యింది.