హైదరాబాద్

ఆదిలోనే అడ్డంకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 19: పధ్నాలుగేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించేందుకు వీలుగా అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం స్కీంకు ఆదిలోనే అడ్డంకులెదురవుతున్నాయి. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని భావించిన సర్కారు ఇందులో లక్ష ఇళ్లను ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలోనే నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే! సర్కారు ఎంతో మహోన్నతమైన సంకల్పంతో ఈ పథకానికి మంజూరు ఇచ్చినా, మహానగర పాలక సంస్థ అధికారులు, వివిధ నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య కుదరకపోటంతో ఇప్పటికే శంకుస్థాపనలు చేసిన తొమ్మిది ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ముందుకు సాగటం లేదు. టెండర్ల ప్రక్రియ పూర్తయినా, నిర్మాణ పనులెలా చేపట్టాలి? ఇందుకు సంబంధించిన డిజైన్ ఏమిటీ? అన్న విషయంపై స్పష్టత లేకపోవటంతో టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో స్థలం ఎక్కువగా లేకపోయినా ఎక్కువ మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు జి ప్లస్ తొమ్మిది అంతస్తులు కూడా నిర్మించేందుకు సిద్దమేనని ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే! కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ భవనాలను జి ప్లస్ టూ, జి ప్లస్ త్రీకి మాత్రమే పరిమితం చేయాలని అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం.
బహుళ అంతస్తు భవనాలపై కసరత్తు
ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన తొమ్మిది ప్రాంతాల్లో జి ప్లస్ తొమ్మిది అంతస్తుల భవనాలు నిర్మిస్తే జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్‌లో ప్రస్తుతమున్న నిబంధనలు వర్తిస్తాయా? లేక స్థలం తక్కువగా ఉన్న చోట భవన నిర్మాణ నియమావళి ప్రకారం బహుళ అంతస్తు భవనాలు నిర్మించవచ్చా? అన్న అంశంపై జిహెచ్‌ఎంసి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కానీ అయిదు అంతస్తుల వరకు నిర్మించే భవనాల్లో మొత్తం ఏరియాలో సుమారు 22 శాతం పార్కింగ్‌కు కేటాయించాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అంతస్తులు నిర్మించే భవనాలకు గాను ప్లాట్లు విస్తీర్ణం, మొత్తం నిర్మాణ భాగంలో 33 శాతం పార్కింగ్‌కు కేటాయించాల్సి ఉంటుంది. అంతేగాక, అయిదు కన్నా ఎక్కువ అంతస్తులు నిర్మించే భవనాల్లోకి రాకపోకలు సాగించేందుకు అరవై అడుగుల వెడల్పుతో రహదారి ఉండాలన్న నిబంధన ఉంది. కానీ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో తొమ్మిది అంతస్తులను నిర్మించాలని భావిస్తున్నా, ఆ భవనాల్లోకి రాకపోకలు సాగించేందుకు 60 అడుగుల వెడల్పున్న రోడ్లు లేవు. అయితే కనీసం 40నుంచి 45 అడుగులన్నా ఉండేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి అధికారులు విధి విధానాలను రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది.