హైదరాబాద్

బల్దియా ‘రవాణా’లో బొక్కేస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: బల్దియా డీజిల్‌ను బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తున్నారని.. వినియోగించని వాహనం పేరిట బిల్లులు డ్రా అయ్యాయని, బిగించని విడి భాగాలకు లక్షలు, కోట్ల రూపాయల బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారంటూ నిత్యం అవినీతి ఆరోపణలెదుర్కొన్న జిహెచ్‌ఎంసి రవాణా విభాగంలో అవినీతి అప్రతిహతంగా కొనసాగు తూనే ఉంది. నగరంలోని ఐదు పార్కింగ్ యార్డులలో నాలుగింటిలో వాహనాల మరమ్మతులకు సంబంధించి ఒక విధానం కొనసాగుతుండగా, మలక్‌పేట్ జైల్ గార్డెన్స్‌లో యార్డులో సప‘రేటు’ విధానం కొనసాగుతోంది. ఇక్కడ కీలకమైన విధులు నిర్వర్తించే ఓ అధికారి రాష్టర్రాజకీయాల్లో కీలక పాత్ర వహించే నాయకుడు తన బంధువని బెదిరిస్తూ ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గతంలో గుర్తింపు యూనియన్‌గా కొనసాగిన జిహెచ్‌ఎంఈయూ నేతలు మంగళవారం కూడా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బల్దియా రవాణా విభాగంలో తరుచూ అక్రమాలు, అవతకవకలు, కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయంటూ తరుచూ ఫిర్యాదులు రావటంతో కమిషనర్ జనార్దన్ రెడ్డి గత సంవత్సరం జనవరి మాసంలో ఈ విభాగాన్ని జోన్ల వారీగా వికేంద్రీకరణ చేశారు. అవినీతి, అక్రమాలు ఆగుతాయని భావించి ఆయన వికేంద్రీకరిస్తే, అంతకన్నా ఎక్కువ స్థాయిలో అక్రమాలు వెలుగుచూడటం గమనార్హం. నగరంలోని మొత్తం ఐదు పార్కింగ్ యార్డుల్లో ఒక్కో దాంట్లో నెలకు వాహనాల మరమ్మతులు, డీజిల్ వంటి ఖర్చులు సుమారు 40లక్షల నుంచి రూ. 60లక్షల లోపు ఖర్చయ్యేది. కమిషనర్ ఈ విభాగాన్ని వికేంద్రీకరణ చేసిన తర్వాత ఒక్కో యార్డులో ఖర్చు సుమారు రూ. 2 కోట్లకు పెరిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. అప్పట్లో రవాణా విభాగాన్ని ప్రధాన కార్యాలయంలోని సిటివో విభాగం పర్యవేక్షణలో ఉండేది. అంతేగాక, ఏ ఒక్క బిల్లుకైనా ఫైలు కమిషనర్ వరకు సర్క్యులేట్ అయ్యేది. అయినా అప్పట్లో కోట్లాది రూపాయల కుంభకోణాలు వెలుగుచూడటంతో రవాణా విభాగానికి కమిషనర్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా వికేంద్రీకరించారు. ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల కేర్‌టేకర్లు డిఈలు, అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు, ఈఈల చేతుల్లోకి వెళ్లిపోవటంతో ఇష్టారాజ్యంగా మరమ్మతులు, డీజిల్ వినియోగం మంజూరవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడాది క్రితమే
ఫిర్యాదు.. చర్యలు నిల్
రవాణా విభాగాన్ని వికేంద్రికరించిన తర్వాత పార్కింగ్ యార్డుల్లో ఏ వాహనానికైనా మరమ్మతులు చేయాలంటే అందుకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు వాహన మెకానిక్, ఈఈ, డిఈల సంతకాలు అవసరమన్న నిబంధన ఉంది. ఈ నిబంధన మలక్‌పేట స్టేషన్ మినహా మిగిలిన స్టేషన్లలో అమలవుతోంది. కానీ మలక్‌పేట యార్డులో వాహనాలకు బిగించేందుకు సామాగ్రిని కొనుగోలు చేసే విషయమై తమ సంతకాలు తీసుకోవటం లేదని, ఇక్కడ మోసపూరితమైన విధానం కొనసాగుతుందని అక్కడే పనిచేస్తున్న మెకానిక్‌లు గత సంవత్సరం సెప్టెంబర్ 29న ఫిర్యాదు చేసినా, నేటికీ చర్యలు తీసుకోలేదు. తమ సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఇండెంట్లు తయారు చేస్తున్నారంటూ మెకానిక్‌లు చేసిన ఫిర్యాదు ఎందుకు బుట్టదాఖలైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రకంగా సంతకాల్లేకుండా తయారు చేసిన ఇండెంట్ల వ్యవహారం తమకు తలనొప్పిగా మారే అవకాశముందని భావించిన మలక్‌పేట యార్డులో ఇంజనీర్లు కొందరు ఔట్‌సోర్సు ఉద్యోగుల సంతకాలతో పాత పనులకు కొత్తగా ఇండెంట్లు సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వికేంద్రీకరణతో పెరిగిన వ్యయం
రవాణా విభాగం వికేంద్రీకరించక ముందు ఒక్కో పార్కింగ్ యార్డులో వాహనాల మరమ్మతులు, డీజిల్‌కు రూ. 60లక్షల నుంచి రూ. 80లక్షల్లోపు ఖర్చయ్యేదని మెకానిక్‌లే చెబుతున్నారు. కానీ వికేంద్రీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని పాతకాలం వాహనాలను తొలగించారు. దీంతో ఒక యార్డులో కేవలం 44 వాహనాలున్నా, అక్కడ మరమ్మతులు, డీజిల్, అద్దె వాహనాలకు నెలకు రూ. 2 కోట్ల వరకు ఖర్చవుతోందని వివరించారు. అంతేగాక, ఐదు పార్కింగ్ యార్డులో నెలకు రూ. 2 కోట్ల వరకు ఖర్చవుతుండగా, ఇపుడు ఆ భారం రూ. 15 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఈ విభాగానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద ఆర్జీలు పెట్టుకున్నా, అధికారులు సమాచారమివ్వకపోవటాన్ని చూస్తుంటే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయనే వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.