హైదరాబాద్

మారియేట్ హోటల్‌లో ఫేకాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బేగంపేట, అక్టోబర్ 20: మహానగరంలో ప్రభుత్వం పేకాటను నిషేధించినా, కొందరు బడాబాబుల అండతో గుట్టుచప్పుడుకాకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్యాంక్‌బండ్ సమీపంలోని హోటల్ మారియేట్‌లో శుక్రవారం టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్‌లో పేకాట ఆడుతున్న 28 మంది పేకాటరాయళ్లు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. కొందరు ప్రముఖులు, ధనికవర్గాలకు చెందిన మహిళలు సైతం ఇందులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
హోటల్ మారియేట్‌లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి పేకాట ఆడేందుకు ఈ హోటల్‌కు వచ్చే వారికి నిర్వాహకులు ఒక్కో పేకాట రాయుడికి రూ. 2లక్షల విలువ చేసే క్యాజినో కాయిన్‌ను జారీ చేస్తూ పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయంగా సమాచారం తెల్సుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసు దాడులు నిర్వహించి ఇద్దరు పేకాట నిర్వాహకులను, మరో ఆరుగురు సహా నిర్వాహకులను మరో 28 పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 23లక్షల 37వేల 650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు 38 సెల్‌ఫోన్లు,రెండు స్వైపింగ్ మిషన్లను, ప్రతి రెండు లక్షలకు ఒకటిగా జారీ చేసే సుమారు 1749 క్యాజినో కాయిన్లు, 15 మద్యం బాటిళ్లు, అలాగే హుక్కా సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు టాస్క్ఫోర్సు అదనపు డిసిపి సి. శశిధర్‌రాజు నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.