హైదరాబాద్

మహా బడ్జెట్ రూ. 13150కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: వచ్చే ఆర్థిక సంవత్సరం(2018-19)కి బడ్జెట్ రూపకల్పన చేసేందుకు జిహెచ్‌ఎంసి కసరత్తు మొదలు పెట్టింది. వర్తమాన ఆర్థిక సంతవ్సరం బడ్జెట్‌కు వచ్చే సంవత్సర బడ్జెట్‌ను మూడింతలు పెంచుతూ అధికారులు ముసాయిదాను తయారు చేశారు. ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు రూ. 20వేల కోట్లతో ప్రతిపాదించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డిపి) కింద పలు చోట్ల మల్టీలేవెల్ ఫ్లై ఓవర్లు, స్కైవేల, అండర్‌పాస్‌లు జంక్షన్ల అభివృద్ధి పనులకు ప్రభుత్వం మం జూరీ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలి దశగా రూ. 3500 కోట్లతో పనులను చేపట్టారు. వర్తమాన సంవత్స రం (2017-18)లో రూ.5643 కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించగా, దీన్ని రూ. 7661 కోట్లకు అంచనాలను సవరించారు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 13150 కోట్ల బడ్జెట్‌ను రూపొందించేందుకు నగరంలో చేపట్టనున్న ఎస్‌ఆర్‌డిపి, లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నందున ఈ సారి బడ్జెట్‌ను రెండింతలు పెంచి సుమారు రూ. 13150 కోట్లతో అంచనాలతో కూడిన ముసాయిదాను ప్రవేశపెట్టారు.
జీహెచ్‌ఎంసి చరిత్రలోనే అతి భారీ బడ్జెట్‌గా దీన్ని పేర్కొనవచ్చు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసికి ఉన్న ప్రధాన ఆర్థిక వనరులైన ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్ భవన నిర్మాణ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ, ట్రేడ్ లైసెన్సులు వంటి ఇతరాత్ర ఆదాయ మార్గాల ద్వారా సుమారు రూ. 2వేల వరకు మాత్రమే ఆదాయం సమకూరుతుండగా, ఏకంగా రూ. 13వేల 150 కోట్ల బడ్జెట్ ముసాయిదా రూపకల్పనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గాను ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డిపి, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వంటి ప్రతిష్టాత్మకమైన పథకాల కోసం బ్యాండ్ల జారీ ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు జిహెచ్‌ఎంసి సమాయత్తమవుతోంది. ఈ మేరకు ముసాయిదాను గురువారం జరిగిన స్థారుూ సంఘం సమావేశంలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌పై తదుపరి స్థారుూ సంఘం సమావేశంలో చర్చించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. స్థారుూ సంఘంలో పలు దఫాలుగా చర్చించిన తర్వాత మార్పులు చేర్పులు చేసి, ఆ తర్వాత బడ్జెట్ కోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులోనూ మళ్లీ మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశముంటుంది. కౌన్సిల్ ఆమోదం తర్వాత తదుపరి ఆమోదం కోసం సర్కారుకు పంపనున్నారు.

బెస్తల జీవనోపాధిని దెబ్బతీసే జీవో 6ను రద్దు చేయాలి

ఖైరతాబాద్, నవంబర్ 16: బెస్తల జీవనోపాధిని దెబ్బతీసేలా తీసుకువచ్చిన జీవో నెంబర్ 6ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ బెస్త, గూండ్ల, గంగపుత్రుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమితి ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి వివిధ బెస్త సంఘాల నాయకులు ఏఎల్ మల్లయ్య, వెంకటేష్, బాలకృష్ణ, హనుమంత రావు, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలకు గురైన గంగపుత్రులు స్వరాష్ట్రంలో కూడా అన్యాయాలకు గురికావడం ఆవేదన కలిగిస్తుందని అన్నారు. చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బెస్తల ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగపుత్రుల హక్కులను కాలరాసేలా తెచ్చిన జీవోను రద్దు చేయకపోతే గంగపుత్రుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.