హైదరాబాద్

నిండుగ తెలుగు పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: మాతృ భాష మాధుర్యాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు భాగ్యనగరం వేదికగా శుక్రవారం సాయంత్రం ప్రపంచ తెలుగు మహిళ సభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎల్‌బీ స్టేడియం ప్రధాన వేదికగా సాయంత్రం తెలుగు సంరంభం ఘనంగా ఆరంభమైంది. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ ఇతర ప్రభుత్వ శాఖలు చేపట్టిన ఆలంకరణ, ముస్తాబు పనులను శుక్రవారం మధ్యాహ్నానికి ముగియటంతో సభలు ప్రారంభించే సమయానికల్లా భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకుంది. ముఖ్యంగా శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు సాహితీవేత్తలు, కవులు, రచయితలతో పలు కార్యక్రమాలు నిర్వహించే వేదికలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ముఖ్యంగా రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలంగాణ సారస్వత పరిషత్తు వంటి కళావేదికలు కళ్లుచెదిరేలా ముస్తాబు చేశారు. అంతేగాక, సెంట్రల్ జోన్ పరిధిలోని తెలుగుతల్లి, బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎల్‌బీ స్టేడియంలో మహాసభలు సాయంత్రం ప్రారంభించే ముందు మధ్యాహ్నం పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు ఎల్‌బీ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రధాన వేదికను తిలకించి మురిసిపోయారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచే అతిధులు ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వారికి ‘స్వచ్ఛ నమస్కారం’ తెలుపుతూ సాదరంగా ఆహ్వానం పలకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొట్టమొదటి సారిగా 1975లో నగరం వేదికగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలను గుర్తుచేసుకున్నారు. నాడు విద్యార్థి దశలో ప్రపంచ తెలుగు మహాసభలకు తమ పాఠశాల తరపున హాజరైన పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు నాటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మరోసారి ప్రపంచ తెలుగు మహాసభలకు భాగ్యనగరం వేదిక కావటం పట్ల నగరానికి చెందిన సాహితీవేత్తలు, రచయితలు, కవులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
వేదికల వద్ద బల్దియా ప్రత్యేక చర్యలు
మహాసభలకు ప్రధాన వేదికైన ఎల్‌బీ స్టేడియంతో పాటు ఇతర ఐదు సాంస్కతిక వేదికల ఆవరణలో, అక్కడకు చేరుకునే రహదారుల్లో ప్రత్యేక పారిశుద్ధ్యపనులను చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది.
ఒక్క ఎల్‌బీ స్టేడియం లోపల ఈ పనులను చేపట్టేందుకు 50 మంది కార్మికులను నియమించింది. బయట పరిసర ప్రాంతాలైన పబ్లిక్‌గార్డెన్స్, బషీర్‌బాగ్, నిజాంకాలేజీ చౌరస్తా, బషీర్‌బాగ్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో ఎప్పటికపుడు పారిశుద్ద్య పనులను చేపట్టేందుకు వీలుగా 200 మంది కార్మికులను నియమించి ఎప్పటికపుడు చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టింది.
అతిథుల బసకు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ మహాసభలకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న అతిధులకు బస కల్పించటంలో జీహెచ్‌ఎంసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సభలకు ఎవరెవరు, ఎక్కడెక్కడి నుంచి హాజరవుతున్నారన్న సమాచారంతో కలెక్టరేట్ అధికారులను సమన్వయం చేసుకుని, అతిధులను వారికి కేటాయించిన గెస్ట్‌హౌస్‌లలో, హోటళ్లకు చేర్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

లలిత జ్యూయలరీలో చోరీ
ఖైరతాబాద్, డిసెంబర్ 15: ప్రముఖ ఆభరణాల షోరూం లలిత జ్యూయలరీలో మరో మారు చోరీ జరిగింది. ఈనెల 3న బురఖా ధరించి వచ్చిన ఇద్దరు మహిళలు సుమారు ఆరు లక్షలు విలువ చేసే గొలుసులను చోరీ చేసుకొని వెళ్లిపోయారు. ఇదే తరహాలో ఈనెల 11న మధ్యాహ్నం సోమాజిగూడాలోని లలిత జ్యూయలరీలోకి ఇద్దరు దంపతులు ప్రవేశించారు. షోరూమ్ మొత్తం కలియ తిరిగిన వారు బంగారు గాజులను చూపించాలంటూ సేల్స్ సిబ్బందిని కోరారు. గాజుల చూపిస్తున్న సమయంలో అక్కడి సిబ్బంది దృష్టి మరల్చి 66 గ్రాముల గాజులను దోచుకొని వెళ్లిపోయారు. మరుసటి రోజు గమనించిన షాప్ సిబ్బంది పంజాగుట్ట పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.