హైదరాబాద్

గజగజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 17: నగరంపై చలి పంజా విసురుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లటి గాలలతో నగర ప్రజలు వణికిపోతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉంటుండటంతో ఉదయం ఏడు దాటినా సూర్యకిరణాలు భూమిని తాకడం లేదు. పొగమంచు నిండిపోతుండటంతో సాయంత్రం ఐదు గంటలకే చీకటి పడుతోంది. సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎముకలు కొరికే చలితో వృద్ధులు, చిన్నారులు సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. చల్లటి వాతావరణంతో జలుబు, జ్వరం, ఫ్లూ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు చలి కారణంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాగ్యనగరంలో నిలువ నీడలేని వారి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారౌతోంది. వీరితో పాటు వివిధ ఆనారోగ్య సమస్యలతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్, క్యాన్సర్ ఆసుపత్రులకు వచ్చిన రోగుల బంధువులు చలితో నరకయాతన అనుభవిస్తున్నారు. చలి మంటలు వేసుకొని జాగారాలు చేయాల్సిన దుస్థితి నెలకొంటోంది.