హైదరాబాద్

ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు స్టడీ సర్కిళ్లు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, జనవరి 19: యువత ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్టడీ సర్కిళ్లు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యాత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఏర్పాటుచేసిన ఎస్సీ స్టడీ ర్కిల్‌ను శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. స్టడీ సర్కిళ్లలో అభ్యసించిన 100 మంది ఉన్నత ఉద్యోగాలను సాధించారని వివరించారు. ప్రస్తుతం కూడా డిఎస్సీ కోసం పట్టువదల కుండా అభ్యసిస్తున్నవారు వంద మంది ఉన్నారని తెలిపారు. వీరితోపాటు పలు పోటీ పరీక్షలకు సన్నద్ధ మవుతున్నవారు కూడా ఉన్నారని అన్నారు. సివిల్స్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలల్లో నెగ్గి రాష్ట్ర ప్రతిభను చాటాలని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. షెడ్యుల్ కూలల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అందరిని అబ్బుర పరుస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎల్‌బీనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ముద్దగోని రాంమోహన్ గౌడ్, కార్పొరేటర్లు జిన్నారం విఠల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.