హైదరాబాద్

డెడ్‌లైన్ ఫిబ్రవరి 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: మహానగరంలోని అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద జీహెచ్‌ఎంసీకి వచ్చిన దరఖాస్తులన్నింటి పరిష్కారానికి సర్కారు గడువు విధించింది. వచ్చే నెల 28వ తేదీ వరకు అమోదయోగ్యమైన అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని ఈ మేరకు జీహెచ్‌ఎంసీకి సర్కారు అధికారికంగా ఆదేశాలిచ్చింది. అయితే ఇప్పటికే దరఖాస్తులన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించి, క్లియరెన్స్‌లు ఇవ్వాలని భావించిన జీహెచ్‌ఎంసీ అధికారులు వచ్చిన దరఖాస్తుల్లో అమోదయోగ్యమైన, అలాగే కొన్ని డాక్యుమెంట్లు తక్కువగా ఉన్న దరఖాస్తులకు సంబంధించి యజమానులతో ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఎల్‌ఆర్‌ఎస్ మేళాలను నిర్వహించింది. అధికారులు ఆశించిన స్థాయిలో దరఖాస్తులను పరిష్కరించకపోవటంతో మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్ మేళాలను నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. వచ్చే ఆదివారం నుంచి ఈ మేళాలను నిర్వహించేలా ఆయా సర్కిళ్ల అధికారులకు నేడు కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. అక్రమ లేవుట్ల క్లియరెన్స్ కోసం జీహెచ్‌ఎంసీకి మొత్తం 71వేల 681 దరఖాస్తులు అందగా, ఇందులో అన్ని రకాలుగా అమోదయోగ్యంగా ఉన్న ఇప్పటి వరకు 21వేల 321 దరఖాస్తులకు క్లియరెన్స్‌లను ఇప్పటికే సిద్దం చేసి ఉంచారు. మిగిలిన దరఖాస్తులకు సంబంధించి యజమానుల నుంచి స్పందన రాకపోవటం, సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై యజమానులకు అవగాహన లేకపోవటం వల్లే మేళాలను నిర్వహిస్తున్నారు. ఈనెల 11నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన మేళాలో ఒక్కరోజే 197 దరఖాస్తులను పరిశీలించారు. కానీ ఇందుకు సంబంధించి క్లియరెన్స్‌లు ఇవ్వటంతో తాత్సారం వహిస్తున్నారు. కానీ సిద్ధంగా ఉన్న క్లియరెన్స్‌లను సైతం దరఖాస్తుదారులకు ఇచ్చేందుకు సిబ్బంది ప్రదిక్షణలు చేయించుకుంటున్నట్లు ఆరోణలున్నాయి. ఒక్కో దరఖాస్తుకు సంబంధించి ఇప్పటికే రెండు దఫాలుగా మొత్తం ఫీజులను చెల్లించినా, తమ సంగతేంటీ? అనే ధోరణీలో సిబ్బంది వ్యవహారిస్తున్నట్లు పలువురు దరఖాస్తుదారులు వాపోయారు.
ఆన్‌లైన్‌తోనూ తప్పని అవస్థలు
నగరంలోని అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ స్కీంను ప్రకటించినపుడు మధ్యవర్తులు, దళారులు, అవినీతి ఏ మాత్రం లేకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలనే ఆంక్ష విధించింది. ఇదే తరహాలో ఖైరతాబాద్ సర్కిల్‌లో రూ.10వేల డీడీతో ఓ దరఖాస్తుదారుడు దరఖాస్తును సమర్పించాడు. డీడీ జీహెచ్‌ఎసీ ఖాతాలో రెమిట్ అయినా, ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారుడికి ఫైల్ తిరస్కరించినట్లు సమాచారమిచ్చారు. సర్కిల్ నుంచి హెడ్డ్ఫాసుకు, అక్కడి నుంచి మళ్లీ సర్కిల్‌కు నేటికీ సదరు దరఖాస్తుదారుడు చక్కర్లు కొడుతున్నాడంటే బల్దియా ఆన్‌లైన్ సేవల్లో ఏ మాత్రం పారదర్శకత ఉందో అంచనా వేసుకోవచ్చు.