హైదరాబాద్

భారతీయ కళలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, జనవరి 21: భారతీయ కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. స్కోర్ మోర్ ఫౌండేషన్ 12వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భరద్వాజ్ వివిధ రంగల్లో విశిష్ట సేవలందించిన వారికి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. గత 12 సంవత్సరాలుగా దేశ, విదేశాలలో వివిధ రంగల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి పురస్కారాలను ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ, దర్శకుడు రేలంగి నరసింహా రావు, ప్రముఖ గాయనీ మాలవిక, మ్యూజిక్ డైరెక్టర్ వీణాపాణి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.పట్ట్భారామ్, డా.శాంతి దేవి పాల్గొన్నారు. సభకు ముందు చిన్నారులు ప్రదర్శంచిన పలు సంస్కృతిక నృత్యలు అందరిని ఆకట్టుకున్నాయి.