హైదరాబాద్

నగరంలో పెరిగిన విద్యుత్ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్‌లో విద్యుత్ వినిమయం మెల్లిగా పెరుగుతోంది. శీతాకాల ప్రభావం వల్ల మొన్నటి వరకు పెద్దగా విద్యుత్ డిమాండ్ లేదు. కాగా సంక్రాంతి తర్వాత విద్యుత్ వినిమియం పుంజుకుంది. గత ఏడాది జనవరి నెలలో ఇదే రోజుల్లో 45.79 ఎంయు డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది 49.19 ఎంయు విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత నెలలో 41.9 ఎంయు విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఒక నెలలో దాదాపు 8 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడినట్లు విద్యుత్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడిప్పుడే ఏసిలు, ఎయిర్‌కూలర్లు పనిచేయడం ప్రారంభిస్తున్నట్లు, ఈ నెలాఖరుకు విద్యుత్ డిమాండ్ 55 ఎంయుకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ వర్గాలు అంచనా వేశాయి. గత ఐదేళ్లుగా జిహెచ్‌ఎంసి పరిధిలో సాలీనా 10 శాతం వరకు విద్యుత్ డిమాండ్ వృద్ధిరేటునమోదవుతోంది. 2016 జనవరి నెలలో 38.79 ఎంయు, 2015లో 36.56 ఎంయు విద్యుత్ డిమాండ్ నమోదైంది.