హైదరాబాద్

మేయర్‌కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సర్ట్ఫికెట్‌ను ప్రదానం చేసింది. మంగళవారం వరల్డ్ వాటర్ డేను పురస్కరించుకుని మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ విభాగాలు, వాక్ ఫర్ వాటర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఇతర స్వచ్ఛంద సంస్థలు మంగళవారం ఉదయం కెబిఆర్ పార్కు వద్ధ లక్షలాది మందితో మానవహారాన్ని నిర్వహించారు. ఈ మానవహారంలో పాల్గొన్న లక్షలాది మంది నీటి పరిరక్షణకు భాగస్వాములు కావాలంటూ వారిచే మేయర్ ప్రమాణం చేయించారు. మేయర్ రామ్మోహన్, జిహెచ్‌ఎంసి కమిషనర్, జలమండలి ఎండి డా.బి. జనార్దన్ రెడ్డిలు అతిధులుగా హజరయ్యారు. జల సంరక్షణపై భారీ ఎత్తున మానవహారాన్ని నిర్వహించినందుకు గాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు మేయర్‌ను కలిసి ఈ ప్రత్యేక అవార్డు, సర్ట్ఫికెట్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ నీటి పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ మానవహారానికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు దక్కటం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు.