హైదరాబాద్

కులవృత్తులను ఆదరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులను ఆదరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘వృత్తులు - ఉపాధి - సమస్యలు - పరిష్కారాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోదండరామ్ మాట్లాడుతూ.. ప్రతి కులవృత్తిని గౌరవించడంతో పాటు వారిటి ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలపై ఉందని అన్నారు. కులవృత్తుల ఉన్న వారితో పాటు వారి పిల్లలను కూడా ఆయా వృత్తులపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణలో నేటికి కుల వృత్తులపై ఆధారపడ్డ వారి జీవితం చాలా దుర్భలంగా ఉందని అవేదన వ్యక్తం చేశారు. కులవృత్తులకి మార్కెట్ సౌకర్యం కల్పించి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పురుషోత్తమ్, వేదిక ప్రతినిధులు తిప్పర్తి యాదయ్య, మోహన్ రావు, జనార్దన్ పాల్గొన్నారు.