హైదరాబాద్

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, భ్రూణ హత్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డా.యోగితారాణా హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ జిల్లా పరిధిలో చేపట్టనున్న బాలిక సంరక్షణ చర్యలపై చర్చించారు. జిల్లా పరిధిలో రిజిష్టర్ అయిన 1115 అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బంది, వైద్య నిపుణులు, వారి అర్హతలు, సెంటర్లలో ఉన్న యంత్ర పరికరాల వివరాలను పరిశీలించి, నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యారోగ్య అధికారిని ఆదేశించారు. వైద్య నిపుణులు, రేడియాలజిస్టులు, సోనాలజిస్టులు, గైనకాలజిస్టులు ఒకటి కంటే ఎక్కువ కేంద్రాల్లో పనిచేస్తున్నారా? ఏ కేంద్రంలో ఏఏ సమయాల్లో అందుబాటులో ఉంటారు, వారి విద్యార్హత, నైపుణ్యత, వారికి శిక్షణనిచ్చిన సంస్థలకున్న అర్హత, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రతి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్‌కు చెక్ లిస్టును రూపొందించాలని సూచించారు. కొత్త అనుమతులు, రెన్యూవల్‌కు వచ్చిన 76 కేంద్రాల యోగ్యతను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినులకీ హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. ఆర్‌బీఎస్‌కే వైద్య బృందాలను హైస్కూళ్లకు పంపేందుకు ఓ షెడ్యూల్‌ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రక్తంలో ఎనిమిది శాతంలోపు హిమోగ్లోబిన్ ఉన్న విద్యార్థినులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్, అదనపు పౌష్ఠికాహారం, రక్తహీనత మాత్రలు ఇవ్వాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో ఈ పరీక్షలను వచ్చే నెల 7వ తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డా.పద్మజ, జిల్లా సంక్షేమ అధికారి జీకే సునంద, ఆర్‌బీఎస్‌కే జిల్లా సమన్వయకర్త డా.శ్రీకళ, డీఈఓ వెంకటసుబ్బమ్మ, సీడీపీఓ ఇంతియాజ్ పాల్గొన్నారు.
అంధ విద్యార్థులకు ప్రత్యేక సెంటర్
నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో రూ.35లక్షల వ్యయంతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ లైబ్రరీ ఫర్ విజువల్లి హ్యాండిక్యాప్డ్ ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సోమవారం కలెక్టర్ జిల్లా గ్రంథాలయాల సంస్థ కార్యదర్శి బీ.ఉమారాణి, ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన రూ.5కోట్ల నిధులతో సిటీ సెంట్రల్ లైబ్రరీని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రూ.52లక్షలతో ఫర్నిచర్, రూ.కోటి 36లక్షలతో మరమ్మతుల పనులు, రూ.3కోట్ల వ్యయంతో అదనపు భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. తార్నాక శాఖ గ్రంథాలయనికి రూ.25లక్షలతో కొత్త భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలిన 85శాతం గ్రంథాలయాలకు రిపేర్లు చేయటం, ఫర్నిచర్ సమకూర్చనున్నట్లు తెలిపారు.