హైదరాబాద్

కోటి కుటుంబాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మహేశ్వరం, మార్చి 12: తెలంగాణలో కోటి కుటుంబాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తామని ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు తెలిపారు. సోమవారం మహేశ్వరం మండలం రావిరాల ఫ్యాబ్‌సిటీలో రూ.260 కోట్లతో 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయునున్న ఆప్టికల్ ఫైబర్ ప్లాంట్‌కు మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలసి భూమిపూజ నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఫైబర్ టెలీ కమ్యూనికేషన్ 4జీ, 5జీ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను తెలంగాణలోని అన్ని గ్రామాలకు విస్తరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని సిరిగిపురం, మహేశ్వరం, మన్సాన్‌పల్లి, తుమ్మలూరు గ్రామాల్లో టీ-ఫైబర్ గ్రిడ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిందని గుర్తుచేశారు. ఇటీవలి కాలంలో ఫైబర్‌కు డిమాండ్ పెరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో డాటా వినియోగం పెరిగి అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి చెందుతుందని తెలిపారు. తెలంగాణలో ఫైబర్ సరఫరా కొరతను నివారించడానికి ఆప్టికల్ ఫైబర్ మాన్యుఫ్యాక్టరింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని అన్నారు. హిమాచల్ వ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్.. ఫైబర్ ప్లాంట్‌కు అనుమతి కోరగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్యాబ్‌సిటీలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి వౌలిక సౌకర్యాలు కల్పించిందని వెల్లడించారు. మొదటి యూనిట్ రూ.260 కోట్లతో చేపట్టి సంవత్సర కాలంలో ఫైబర్ కేబుల్ ముడిసరుకు తయారు చేస్తారని, రాబోయే కాలంలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. స్థానిక నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి అవకాశాలు కల్పించాలని ప్రిన్సిపాల్ సెక్రటరి జయేశ్ రంజన్‌కు సూచించారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహింపట్నం, శంషాబాద్ ప్రాంతాల్లో అనేక పరిమ్రలు వస్తున్నాయని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హిమాచల్ వ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ చైర్మన్ మహేంద్ర శుక్లా, మేనేజర్ డైరెక్టర్ మహేంద్ర నహతా, ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇక్కడ చెత్త వేయరాదు
* ఖాళీ స్థలాల్లో బల్దియా బోర్డులు
* చెత్త వేయటాన్ని నివారించేందుకు ఇన్‌చార్జిల నియామకం అవసరమైనచోట పార్కింగ్‌కు వినియోగం

హైదరాబాద్, మార్చి 12: మహానగరంలో బల్దియాకు చెందిన ఖాళీ స్థలాల్లో ప్రజలు చెత్త వేయకుండా ప్రజల భాగస్వామ్యంతోనే జీహెచ్‌ఎంసీ మరో అరుదైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ ఖాళీ స్థలాలకు ఇరువైపులా కాంపౌండ్ వాల్స్ నిర్మించటం, అందులో మొక్కలను పెంచటం వంటి చర్యలను సోమవారం నుంచి అమలుచేయాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 12వతేదీ వరకు ఈ చర్యలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. నగరంలోని పలు ఖాళీ స్థలాల్లో ఇప్పటికే భారీగా చెత్త కుప్పలుగా పేరుకుపోయినట్లు, అవి దోమల వృద్ధికి కేంద్రాలుగా మారినట్లు ఫిర్యాదులు రావటంతో కమిషనర్ చర్యలకు సిద్ధమయ్యారు. చెరువుల పరిరక్షణకు స్థానిక ప్రజలతో కలిపి లోకల్ కమిటీలను నియమించినట్టే ఈ ఖాళీ స్థలాల పరిరక్షణతోపాటు చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు ప్రజల సహాయ సహకారాలను తీసుకోవాలని కమిషనర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. నెలరోజుల పాటు ఖాళీ స్థలాలను గుర్తించటంతో పాటు బల్దియాకు చెందిన స్థలాలుంటే వాటిచుట్టూ తగిన అనుమతులు తీసుకుని, ప్రహరీలను నిర్మించి, అందులో చెత్తాచెదారం ఉంటే తొలగించి, మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించాలని సూచించారు. ఇలాంటి స్థలాల్లో ఇక్కడ చెత్త వేయరాదన్న బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ఇలాంటి ఖాళీ స్థలాలను స్థానికులకు పనికొచ్చేలా ప్లే గ్రౌండ్‌లుగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాలుంటే, యజమానులతో చర్చించి, వాటిచుట్టూ ప్రహరీలను నిర్మించాలని ఆదేశించారు. ఒకవేళ ఈ స్థలాలు పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటే, అందులో వాహనాల పార్కింగ్‌ను ప్రోత్సహించేలా డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని ఖాళీ స్థలాల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. గోడలను నిర్మించిన తర్వాత కూడా స్థానికులు వేస్తే, అట్టివారిని గుర్తించి, వారికి, ఖాళీ స్థలాల ఇరుగుపొరుగు ఇళ్లకు చెందినవారికి సైతం కౌనె్సలింగ్ నిర్వహించాలన్నారు. ఈ ఖాళీ స్థలాల్లో ఎవరూ చెత్త వేయకుండా ఉండేందుకుగాను ఓ జవాను, ఎస్‌ఎఫ్‌ఏ లేక ఇతర కార్మికుడ్ని ఇన్‌చార్జిగా నియమించాలని సూచించారు. అధికంగా చెత్త వేయటంతో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, వారిని స్వచ్ఛ రాయబారిగా నియమించాలని స్పష్టం చేశారు.