హైదరాబాద్

సమతుల పోషకాలతోనే ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 25 : సమతుల ఆహారంతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని, ప్రతిరోజు ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, పోషకాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ పిడిగెం సైదయ్య అన్నారు. శుక్రవారం హమిదుల్లానగర్‌లో ఉద్యాన కళాశాల విద్యార్థులు ఏడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం రెండు రోజులపాటు కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే కూరగాయలు, పండ్లతో గృహిణిలు సొంతంగా తమ స్థాయిలో తయారు చేసుకోదగ్గ పదార్థాలను ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు వివరించారు. టమాట జామ్, అరటి, సపోటాతో చేసిన మిల్క్ షేక్, పుచ్చపండు ఆధారిత ద్రవపదార్థాలు వంటి పోషకాలతో కూడిన ఉత్పత్తులను మహిళలకు నేర్పించారు.
అనంతరం ప్రోగ్రాం ఆఫీసర్ సైదయ్య మాట్లాడుతూ.. రెడిమేడ్ ఆహార పదార్థాలు ముందే తయారుచేసి అమ్మకానికి ఉంచిన వాణిజ్యంగా లభించే పేస్ట్‌లు, మిక్సీలను వాడితే అనవసర రోగాలు కొనితెచ్చుకోవడమేనని ఆయన వెల్లడించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు రోజువారి ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. విలువ జోడించిన పలు ఉత్పత్తులను ఎన్ ఎస్ ఎస్ ఉత్పత్తులను గ్రామస్థులకు పంపిణీ చేశారు.
ఆహారంలో తీసుకోవాల్సిన పోషకాలపైన తయారు చేసిన ప్లేకార్డులు, పోస్టర్లను విద్యార్థులు ప్రదర్శించారు. వివిధ కూరగాయాలు, పండ్లల్లో లభించే, ఖనిజాలు, విటమిన్ల మోతాదును తెలియజేశారు. పోషకాహార ప్రాధాన్యతను వివరిస్తూ గ్రామంలో ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవిగౌడ్, ఎంపీటీసీ మణెమ్మ, కళాశాల అధ్యాపకులు నవ్యశ్రీ, దీపిక, తరుణ్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు రక్తదాన శిబిరం ...
కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం ఆఫీసర్ సైదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యాన కళాశాల ఆవరణలో రక్తదాన శిబిరానికి కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, వర్సిటీ విద్యార్థుల వ్యవహారాల డీన్ డాక్టర్ వనజాలత ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.