హైదరాబాద్

జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: మహానగరంలో ఒకటి, రెండు కాదు ఏకంగా అరడజను ప్రభుత్వ శాఖలకు తలభారంగా మారిన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ రకరకాల మార్గాలను అనే్వషిస్తోంది. ఇప్పటికే రూ. 22వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యచరణ (ఎస్‌ఆర్‌డీపీ) కింద పలుచోట్ల మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లను నిర్మిస్తున్న జీహెచ్‌ఎంసీ ఈ పనులకు సమాంతరంగా నిత్యం ట్రాఫిక్ ఉండే జంక్షన్లపై కూడా దృష్టి సారించింది. ఇందుకు అర్బన్ జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ (యుజేఐపీ) అనే ప్రత్యేక ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ ప్లాన్ కింద నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోని వంద జంక్షన్ల అభివృద్ధి పనులను చేపట్టింది. ఎంపిక చేసిన జంక్షన్ల అభివృద్ధి పనులన్నీ వచ్చే మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని గడువు పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే ఇరవై జంక్షన్లలో పనులు పురోగతిలో ఉన్నాయి. చాలాచోట్ల జంక్షన్లు పెద్దగా ఉండటం, దానికిరువైపులా ఉన్న రోడ్డు చిన్నదైపోవటంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. సిగ్నల్స్ పడినపుడు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వీలుగా వీటి డిజైన్లను తయారుచేసి పనులు చేపడుతున్నారు. జంక్షన్ల మీదుగా సాగే రాకపోకలు, వాహనాల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, నగర ట్రాఫిక్ పోలీసులు ఈ జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ చర్యలతో నగరవాసులకు ప్రయాణం సమయం తగ్గటంతోపాటు ఫ్రీ లెఫ్టును పెంచేందుకు వీలుగా పనులు చేపట్టారు. అంతేగాక, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటున్నందున, ఈ సమస్యను పరిష్కరించేందుకు యూ టర్న్‌ల వద్ద అవసరమైన చోట్ల రోడ్డును కూడా విస్తరించనున్నారు. ఈ జంక్షన్లలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సైనేజీలను ఏర్పాటు చేయటంతో పాటు రోడ్డు మార్కింగ్‌లు వంటివి చేపట్టారు. ఇప్పటికే 20 జంక్షన్లలో వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల ప్రకారం ఈ నెలాఖరుకల్లా ఆరు జంక్షన్లలో, మరో ఆరు జంక్షన్లలో వచ్చే నెలాఖరుకల్లా పనులు పూర్తయ్యే అవకాశమున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మరో ఎనిమిది జంక్షన్ల పనులను మే చివరికల్లా పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. రెండో దశగా ఎంపిక చేసిన మరో 30 జంక్షన్ల పనులను త్వరలోనే చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జంక్షన్లలో ప్రస్తుతం ట్రాఫిక్, టోపోగ్రాఫిక్ సర్వేలు కొనసాగుతున్నాయి. ఆక్రమణల తొలగింపు, మరికొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లను పార్కింగ్‌లుగా వినియోగించటం వంటి కారణాలతో పనులను వేగవంతం చేయలేకపోతున్నారు. మరికొన్ని జంక్షన్లలో జలమండలి ఆధ్వర్యంలో వరద నీటి కాలువలు, డ్రెయిన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటితోపాటు మరికొన్ని జంక్షన్లలో భూగర్భ కేబుల్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజావాణికి అధికారులందరూ హాజరుకావాలి

హైదరాబాద్, మార్చి 12: ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రజలనుంచి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి సత్వర పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రజలనుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జె.యన్.యన్.యు.ఆర్.యం. ఇండ్ల కేటాయింపులు, పెన్షన్లు, భూసమస్యలు, రుణ మంజూరు, రుణమాఫీ, ఆహార భద్రత కార్డు తదితర అంశాలపై సుమారు 52 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందువలన బడ్జెట్‌లో నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని సంక్షేమ శాఖలు తాము అమలుచేస్తున్న కార్యక్రమాల క్రింద నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ ఫలాలను అందించాలని ఆదేశించారు. ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి శోభ, జిల్లా పరిషత్ సిఇఓ రాజేశ్వర్‌రెడ్డి, పిడి డిఆర్డీఏ ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఐటీ నేతృత్వంలో వివిధ శాఖల వెబ్‌సైట్లు
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలు, ఏజన్సీల వెబ్‌సైట్లన్నీ ఇక నుండి ఐటి శాఖ ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై అన్ని కోణాల్లో ఆలోచించి పదిరోజుల్లోగా తనకు నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డ్టార్ ఎస్‌కె జోషి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి 265 వెబ్‌సైట్లు/పోర్టల్స్ ఉన్నాయని గుర్తు చేశారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే పనిచేయాలని, ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ, మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. అవసరమైతే సిజిజి సహకారం తీసుకోవాలని సిఎస్ సూచించారు. వెబ్‌సైట్ల నిర్వహణ, సమాచారం అప్‌డేట్ ఎప్పటికప్పుడు చేస్తుండాలని సూచించారు. ప్రభుత్వ జీఓలు తెలుగులో ఉండేలా చూడాలని సూచించారు.
ఐటి శాఖ సొంతంగా పోర్టల్‌ను నిర్వహిస్తూ, ఇతర శాఖలకు సహకారం అందిస్తోందని ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. సూర్యాపేట జిల్లాలో అమలు చేస్తున్న ‘జనహిత’ (ఇంటెగ్రీటెడ్ గ్రీవెనె్సస్ రీడ్రెసల్ మేనేజ్‌మెంట్) విధానాన్ని ఈ సందర్భంగా సమీక్షించారు. జనహితలో ప్రజలు తమ ఫిర్యాదులను ప్రత్యక్షంగా ఇవ్వడంతో పాటు ఈమెయిల్, వాట్సాప్, ఆన్‌లైన్, మొబైల్‌ల ద్వారా ఇస్తున్నారని అధికారులు సిఎస్‌కు తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.