హైదరాబాద్

నెలరోజుల పాటు రెడ్‌రోజ్ హోటల్ రోడ్డు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: భూగర్భ కేబుల్ పనులు జరుగుతున్న దృష్ట్యా శ్రీనగర్ కాలనీ రోడ్ (బిగ్‌బజార్ వెనుక) నుంచి రెడ్ రోజ్ హోటల్ (నిమ్స్ హాస్పిటల్ ఎదురు) రోడ్డులో ట్రాఫిక్‌ను 30 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. రోడ్డు గుండా వెళ్లే వాహనాలు, ఆర్టీసి బస్సులు, భారీ వాహనాలను ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం ద్వారా మళ్లిస్తున్నట్లు శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. 20 నుంచి ఏప్రిల్ 18 వరకు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి వచ్చే జిల్లా బస్సులను పంజాగుట్ట వైపునకు అనుమతించడం లేదని తెలిపారు. ట్రాఫిక్‌ను కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌రోడ్, బాలానగర్, ఫిరోజ్‌గూడ, బోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్ జంక్షన్, బాలామరాయ్ జంక్షన్, సీటీవో జంక్షన్, ప్యారడైజ్ హోటల్, ఎంజిరోడ్, రాణిగంజ్ జంక్షన్, కర్భాలా మైదాన్, అప్పర్ ట్యాంక్‌బండ్, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, ఎజి ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. పటాన్‌చెరు, మియాపూర్, కూకట్‌పల్లి వైపు నుంచి ఆంధ్రా, రాయలసీమకు వెళ్లే ప్రైవేట్ బస్సులను అమీర్‌పేట, పంజాగుట్ట మీదుగా అనుమతించకుండా, ట్రాఫిక్‌ను కూకట్‌పల్లి వైపునకు ఎస్‌ఆర్‌నగర్ గౌతమ్ డిగ్రీ కాలేజీకి వద్ద యు టరన్ తీసుకుని ప్రయాణీకులను ఎక్కించుకుని వెళ్లాలని సూచించారు. అలాగే సిటి బస్సులను, ఇతర నిత్యావసర సరుకుల రవాణా వాహనాలను ఎస్‌ఆర్ నగర్ క్రాస్ రోడ్ (ఉమేష్ చంద్ర విగ్రహం) వద్ద ఎడమ వైపునకు మళ్లించి కమ్యూనిటీ హాల్, ఆర్‌అండ్‌బి సిగ్నల్ నుంచి కుడివైపునకు తిరిగి సోనాబాయ్ టెంపుల్, అమీర్‌పేట జిహెచ్‌ఎంసీ గ్రౌండ్, డికెరోడ్ జంక్షన్, గ్రీన్‌లాం డ్స్ జంక్షన్, ఐటిసి కాకతీయ హోటల్, మోనప్ప ఐలాండ్, సోమాజిగూడ రోడ్, రాజ్‌భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ మీదుగా మళ్లించి అక్కడి నుంచి యధాతధంగా నడుస్తాయని తెలిపారు.

ఖరీదైన కెమెరాలు అద్దెకు తీసుకుని పరార్
హైదరాబాద్, మార్చి 17: ఖరీదైన కెమెరాలను అద్దెకు తీసుకుని ఆ తర్వాత వాటిని అమ్ముకుని పరారీలో ఉన్న ఇద్దరు కేటుగాళ్లను రెయిన్‌బజార్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. మీర్‌చౌక్ ఎసీపీ తెలిపిన వివరాలు.. ఎల్‌బినగర్ ప్రాంతానికి చెందిన గోడల సందీప్ రెడ్డి, అదే ప్రాంతానికి చెందిన రాచకొండ కృష్ణప్రసాద్ అలియాస్ కిట్టులను అరెస్టు చేసి రూ.5.5 లక్షల విలువైన 11 డీఎస్‌ఎల్‌ఆర్ కానన్, నికాన్ కంపెనీల కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఓలెక్స్ వంటి వెబ్‌సైట్లలో అద్దెకు కెమెరాలు ఇవ్వబడుననే ప్రకటనలు చూసి వారికి ఫోన్ చేసి వ్యక్తిగతంగా కలుస్తారు. వారికి పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు ఇలా ఏదోఒక ఫ్రూఫ్ ఇచ్చి కెమెరా అద్దెకు కావాలని తీసుకుంటారు. తర్వాత ఎప్పటికీ కెమెరా తిరిగి ఇవ్వరు. ఆ కెమెరాను అమ్ముకుని సొమ్ము చేసుకుని జల్సా చేస్తుంటారు. ఈ రకంగా పలు చోట్ల నిందితులు మోసానికి పాల్పడ్డారు. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14న షేక్ అబ్ధుల్ రహ్మాన్, 16న మహ్మద్ యూసఫుద్దీన్ అనే వ్యక్తులు విడివిడిగా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు నిందితులు ఇదే తరహా నేరాలు చాంద్రాయణగుట్ట, కాచిగూడ, లంగర్‌హౌజ్, మీర్‌పేట్, సైఫాబాద్ పోలీసు స్టేషన్ల పరిధిలో కూడా చేయగా అక్కడ కూడా కేసులు నమోదయ్యాయి. దక్షిణ మండలం డీసీపీ వీ.సత్యనారాయణ పర్యవేక్షణలో మీర్‌చౌక్ ఏసీపీ బీ.ఆనంద్, రెయిన్‌బజార్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎంఏ జావేద్ బృందం కేసు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంది.