హైదరాబాద్

రెవెన్యూ రికార్డుల్లోకి వక్ఫ్ భూములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వక్ఫ్ బోర్డుకు చెందిన భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. నగరంలోని 196 మసీదుల్లో మరమ్మతుల పనులకు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డితో కలిసి శనివారం మసీదు కమిటీలకు చెక్కులను అందజేశారు. నాంపల్లి హజ్‌హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో అలీ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యతోనే మార్పు సాధ్యమవుతుందనే సంకల్పంతో 204 మైనారిటీ గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. 1948లో తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినా, 1956లో ఆంధ్రాలో విలీనం చేయటంతో సంస్కృతికి విఘాతం కలిగిందని పేర్కొన్నారు. మసీదుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే వారి పండుగలను ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు. కలెక్టర్ డా.యోగితారాణా.. ఉర్దూలో ప్రసంగిస్తూ 655 మసీదుల మరమ్మతులకు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. తహశీల్దార్లు, సర్వశిక్షా అభియాన్, ఇంజనీరింగ్ అధికారులు ఆయా మసీదులను పరిశీలించినట్లు తెలిపారు. 305 మసీదులలో మాత్రమే చిన్నచిన్న మరమ్మతులు ఉన్నట్లు నిర్దారించారు. రూ. 1.87 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వాటిలో మొదటి విడతగా యాభై శాతం నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయిన వెంటనే మిగిలిన 50 శాతం నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మైనారిటీ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి అభ్యర్థికి ప్లేస్‌మెంట్ గ్యారంటీతో ఈ శిక్షణను ఇచ్చేందుకు రూ.లక్ష చొప్పున ఖర్చు చేయనున్నట్లు వివరించారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఉర్దూ ప్రసంగాన్ని డిప్యూటీ సీఎం, హోం మంత్రి అభినందించిన ఈ కార్యక్రమంలో హాజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే మసిఉద్దీన్, మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీ సలీం, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, ఎమ్మెల్సీ జాఫ్రీ, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, కౌసర్ మోహియుద్దిన్, పాషాఖాద్రి, వౌజంఖాన్, జీ.కిషన్‌రెడ్డి, జిల్లా మైనారిటీ అధికారి ఎండీ ఖాసిం, ఇన్‌చార్జి డీఆర్‌ఓ సరళావందనం, ఆర్డీఓ చంద్రకళ పాల్గొన్నారు.