హైదరాబాద్

ఆందోళన వద్దు.. నీళ్లు పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: వేసవి కాలం ప్రారంభమైనా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల అవసరాలకు తగిన విధంగా పుష్కలంగా నీళ్లున్నాయని జలమండలి ఎండీ దాన కిషోర్ స్పష్టం చేశారు. శనివారం బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండీ వేసవి కార్యచరణ, ట్యాంకర్ రహిత బస్తీలు, రెవెన్యూ, సీవరేజీ వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ మున్ముందు ఎండలు మరింత మండిపోయే అవకాశమున్నందున నగరంలో ఎక్కడా కూడా మంచినీటి సరఫరాలో లోపాలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల్‌లో మంచినీరు పుష్కలంగా ఉందని, ప్రస్తుతం నగరంలో ప్రతిరోజు 400 మిలియన్ల గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నామని, అవసరమైతే మరో 25 గ్యాలన్ల నీటిని అదనంగా సరఫరా చేసేందుకు జలమండలి సిద్దంగా ఉందని, ఇందుకు కావల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వేసవి కార్యచరణ ప్రణాళికను పర్యవేక్షించేందుకు నియమించిన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి లోపాలను గుర్తించాలని ఆదేశించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి, సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రత్యేకాధికారులు, జీఎంలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. వీరంతా వేసవి కాలం మొత్తం క్షేత్ర స్థాయి పర్యటనలు జరపాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన ట్యాంకర్ రహిత బస్తీల్లో జరుగుతున్న పనులపై పూర్తి నివేదిక వారం రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. ఈ పనులతో ఎన్ని ట్యాంకర్లు నిలిపివేశారో నివేదికలో తెలపాలని సూచించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే బస్తీల్లో నాలాల ద్వారా నీటిని సరఫరా చేస్తే బోర్డుకు కొంత మేరకు ఆర్థిక భారం తగ్గుతోందని వివరించారు. రెవెన్యూ విషయాన్ని సమీక్షిస్తూ బోర్డుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆపరేషన్స్, మెయింటనెన్స్ అధికారులను ఆదేశించారు. చాలా కాలంగా బోర్డుకు మంచినీటిని చెల్లించని వినియోగదారుల నుంచి మూడు నెలల్లో బకాయిలు వసూలు చేయాలని వివరించారు. సీవరేజీ ఆపరేషన్స్ చేపడుతున్న పారిశుద్ధ్య పనులపై వచ్చే సమావేశంలో పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో బోర్డు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ డా.పీఎస్. సూర్యనారాయణ, ఆపరేషన్స్-1 డైరెక్టర్ అజ్మీరాకృష్ణ, ఆపరేషన్స్-2 డైరెక్టర్ పి.రవి, రెవెన్యూ డైరెక్టర్ బి.విజయకుమార్ రెడ్డితో పాటు ఆపరేషన్స్, మెయింటనెన్స్ సీజీఎం, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు ప్రత్యేక వెబ్‌సైట్
కీసర, మార్చి 17: జిల్లాలోని నిరుద్యోగ యవతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాతో పాటు, పరిసర జిల్లాలో ఉన్న ప్రైవేట్ కంపెనీల వివరాలు ఉండేలా చూడాలన్నారు. కంపెనీ యాజమాన్యాలు మేడ్చల్ జిల్లా వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారిని నియామకం చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణలు ఇచ్చే కంపెనీలు వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేసుకునేలా రూపొందించాలన్నారు. జిల్లా అధికారులతో వెబ్‌సైట్ డెమోను కలెక్టర్ పరిశీలించారు. వెబ్‌సైట్‌లో చేయాల్సిన మార్పులను అధికారులకు వివరించారు. కార్యక్రమంలో డీపీవో సురేశ్ మోహన్, డీఆర్‌డీవో కౌటిల్య, డీఐసీవో రవీంద్ర, జిల్లా క్రీడల అధికారి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.