హైదరాబాద్

పర్యావరణానికి చేటుచేసే ఓపెన్‌కాస్ట్ గనులను విరమించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 25: పర్యావరణానికి తీవ్ర స్థాయిలో చేటుచేసే ఓపెన్‌కాస్ట్ గనుల త్వకాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ నిర్వాసిత వ్యితిరేక ఫోరం హెచ్చరించింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాయకులు రమేష్ బాబు, పాశం యాదగిరి, ప్రభాకర్ మాట్లాడుతూ బ్రతికుండగా ఓపెన్‌కాస్ట్ గనులను తవ్వనివ్వనని ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తాననే మాటను ఎలా పక్కన బెట్టారో అదేవిధంగా ఓపెన్‌కాస్ట్ గనుల విషయంలో సైతం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది కుటుంబాలను నిరాశ్రయులను చేయడంతో పాటు పర్యావరణానికే తీవ్ర హాని కలిగించే ఓపెన్‌కాస్టులకు ప్రభుత్వం అనుమతించడం ఏమిటని ప్రశ్నించారు. చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతాల్లో ఈనెల 29న కళ్యాణిఖని పేరిట భారీ ఓపెన్‌కాస్ట్‌కు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని విమర్శించారు. దీనితో 53 గ్రామాల ప్రజలు నిర్వాసితులు అవుతారని, 45వేల ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు 50వేల ఎకరాల అటవీ భూమి నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్రను ప్రజలకు వివరించి ఉద్యమానికి సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈనెల 29న చలో ఎర్రగుంటపల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. భూమాత రక్షణకు, ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు పాల్గొనాలని కోరారు.