హైదరాబాద్

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, మార్చి 22: సంపూర్ణ ఆరోగ్యవంతమైన తెలంగాణను సాధించాలన్న విజన్‌తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కేసిఆర్ కిట్లు కార్యక్రమాన్ని ప్రారంభించారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సీ.లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం శాసనమండలిలో సభ్యులు బీజేపీ ఎమ్మెల్సీ ఎం.రాంచందర్‌రావు, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎం.ఎస్.ప్రభాకర్‌రావు, రాములు నాయక్, ఫురూక్‌హుస్సేన్, కృష్ణారెడ్డిలు లఘు చర్చ గావించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ చెబుతూ కేసీఆర్ కిట్లు పథకాన్ని అమల్లోకి తెచ్చి 9 నెలల 20 రోజులు గడిచిందని, ఇప్పటి వరకు ఈ స్కీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగిందని వివరించారు. ఈ స్కీం కింద గర్భిణిలు పరీక్షలు చేయించుకునేందుకు, ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవించేందుకు సుమారు 4లక్షల 60 వేల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ స్కీం కింద ప్రతి ప్రభుత్వాసుపత్రిలో లేబర్ రూంలను ఆధునీకరించటం, అక్కడ సామగ్రిని మెరుగుపర్చటంతో పాటు మందులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మహిళా గర్భం దాల్చిన రోజు నుంచి ప్రసవం, అనంతరం శిశువుకు ఇమ్యూనైజేషన్ చేయించే వరకు ఈ స్కీంను వర్తింపజేస్తున్నట్లు, వారికి అన్ని రకాలుగా ఆశా వర్కర్లు సహకరిస్తున్నట్లు తెలిపారు. దీనికి తోడు గర్భిణిలకు 102 వాహన సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ స్కీం కింద నమోదైన కేసుల్లో సీరియస్, క్రిటికల్ కేసులను ఉన్నతమైన కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫెర్ చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ స్కీంను మరింత పకడ్బందీగా విజయవంతంగా అమలు చేసేందుకు గాను సీఎం ఇనె్సంటీవ్స్‌ను ప్రకటించినట్లు తెలిపారు.
ఐదు ఎకరాల్లో గౌడ భవనం: మంత్రి పద్మారావు
రాష్ట్రంలోని గౌడ కులస్తులకు ఐదు ఎకరాల్లో రూ.5 కోట్లతో గౌడ భవనాన్ని నిర్మించేందుకు ప్రభు త్వం సానుకూలంగా ఉన్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టీ. పద్మారావు శాసన మండలిలో ప్రకటించారు. తెలంగాణ ఏర్పడే నాటికి బకాయి ఉన్న రూ. 6.38 కోట్లను గీత కార్మికులకు పరిహారంగా చెల్లించామని వివరించారు. అంతేగాక, ప్రమాదశాత్తు మృతి చెందే గీతన్న కుటుంబాలకు రూ. ఐదు లక్షల రూపాయలను నప్టపరిహారంగా పెంచామని తెలిపారు. గీత కార్మికుల పెన్షన్‌ను కూడా రూ.200 నుంచి వెయ్యికి పెంచామన్నారు. దీని వల్ల 30వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతోందని తెలిపారు. అంతేగాక, లైసెన్సు రెన్యువల్‌కు ప్రస్తుతమున్న ఐదేళ్ల గడువును పదేళ్లకు పెంచినట్లు మంత్రి తెలిపారు. తాటీ, ఈత చెట్లపై వేసే పన్నును రద్దు చేశామని, దీన్ని వల్ల ప్రభుత్వంపై రూ. 16 కోట్ల మేరకు ఏటా భారం పడుతుందని తెలిపారు.