హైదరాబాద్

కలెక్షన్ ఫీవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థకు కలెక్షన్ ఫీవర్ పట్టుకుంది. అసలే ఆర్థిక సంవత్సరం చివరి రోజులు..పైగా మున్ముందు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పైసా పన్ను పెంచకుండానే ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్‌ఎంసీ అవకాశమున్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటుంది. వర్తమాన ఆర్థిక సంవత్సరం రూ.1400 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు రూ.1090 కోట్లను వసూలు చేసుకున్నట్లు, మిగిలిన లక్ష్యానికి తగిన విధంగా కలెక్షన్లను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే సర్కిళ్ల వారీగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, వ్యాలుయేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లకు సైతం కలెక్షన్ టార్గెట్లను విధించారు. కలెక్షన్‌ను ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు పన్నును వసూలు చేసుకోవటంలో భాగంగా సెలవు రోజులైన ఆది, సోమవారాలు కూడా ట్యాక్స్ విభాగంలోని సిబ్బందికి పని దినాలుగా పరిగణిస్తూ శనివారం సర్క్యులర్ జారీ అయింది. ఆదివారం అన్ని సర్కిళ్లలో ప్రాపర్టీ ట్యాక్సు పరిష్కారం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించి, ఆస్తిపన్నుకు సంబంధించి ప్రజల్లో ఉన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసి, వారిచే పన్ను కట్టించుకోవాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరపడుతుండటంతో ఆది, సోమవారాలు రెండు రోజులు కూడా ప్రజలకు సర్కిళ్లలోని సిటిజన్ సర్వీసు సెంటర్లను తెరిచే ఉంచుతున్నట్లు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యం చేరుకునేందుకు మిగిలిన సుమారు రూ.300 కోట్లను రానున్న వారం రోజుల్లో వసూలు చేసేందుకే ఈ సెలవు రోజులను పని దినాలుగా పరిగణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న రాత్రి ఎనిమిది గంటల వరకు కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొన్నారు.