హైదరాబాద్

బల్దియా బాండ్లకు కేంద్రం నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ బాండ్ల రూపంలో నిధులను సమీకరించేందుకు జీహెచ్‌ఎంసీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అభినందించింది. స్థానిక సంస్థలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు వనరులను అనే్వషించాలని ఇప్పటికే ప్రదాని నరేంద్రమోదీ సూచనను మొట్టమొదటి సారిగా అమలు చేయటంలో బల్దియా అగ్రస్థానంలో ఉంది. తొలి దశగా రూ. వెయ్యి కోట్లను బాండ్ల ద్వారా సమకూర్చుకోవాలని భావించిన జీహెచ్‌ఎంసీ, తొలుత రూ. 200 కోట్లను సేకరించేందుకు సిద్ధమైంది. మున్సిపాలిటీలు బాండ్ల ద్వారా నిధులను సేకరించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్దమైంది. ఈ రకంగా నిధుల సమీకరణకు సిద్ధమైన దేశంలోని 20 మున్సిపాలిటీలకు కూడా ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ విధమైన ఆర్థిక ప ఉరస్కారాన్ని అందించేందుకు సిద్థమైంది. జీహెచ్‌ఎంసీని కేంద్ర ప్రభుత్వ గృహానిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా అభినందించటంతో పాటు రూ. 26 కోట్లను బహుమతికి ప్రకటించింది.
హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రదాని నరేంద్రమోదీ చేసిన సూచన మేరకు నగరంలో చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు బాండ్ల సేకరణతో నిధుల సమీకరణ అనివార్యమైంది. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితులు, పన్నుల వసూళ్లు, ఆర్థిక క్రమశిక్షణను అధ్యయనం చేసిన కేర్, ఇండియా రేటింగ్ సంస్థలు ఏఏ రేటింగ్‌ను చ్చారు. ప్రభుత్వ సంస్థలకు ఏఏ స్టేబుల్ రేటింగ్ రావటం ఎంతో గొప్ప విషయమని ఆర్థిక వేత్తలు కూడా బల్దియాను అభినందించారు. జీహెచ్‌ఎంసీ అవలంభిస్తున్న ఆర్థిక క్రమశిక్షణే ఇందుకు నిదర్శనంగా కేంద్రం పేర్కొంది. బాండ్లపై గత నెల 14న ముంబయలో ఎలక్ట్రానింగ్ బిడ్డింగ్ ఆహ్వానించగా, జీహెచ్‌ఎంసీ అంచనాలకు మించి బిడ్డింగ్‌లో ఆర్థిక సంస్థలు పాల్గొన్నాయి. ఈ బిడ్డింగ్‌లో 8.90 శాతం రేట ప్రకారం రూ. 200 కోట్లను సేకరించారు. ఈ నిధులను నగరంలో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)కి వెచ్చిస్తున్నారు. గడిచిన ఐదు, ఆరు దశాబ్దాలుగా దేశంలోని మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు బాండ్ల రూపంలో రూ.2వేల కోట్లు సుమారు సేకరించగా, వీటిలో పది శాతం మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ ఒక్కటే సేకరించింది. తాజాగా బాండ్ల నిర్ణయాన్ని అభినందిస్తూ జీహెచ్‌ఎంసీకి కేంద్ర ప్రభుత్వం రూ. 26 కోట్లను నజరానాగా ఇవ్వటం ఇతర స్థానిక సంస్థలకు స్ఫూర్తిగా నిలవనుంది.