హైదరాబాద్

తెలుగు సినీ పరిశ్రమలో కోఆర్డినేటర్ల పాత్ర పోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు చిత్ర రంగంలో కో ఆర్డినేటర్లు, దళారుల పాత్ర పూర్తిగా తొలగిపోవాలని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశార. శరీర సుఖం ఇస్తేనే అవకాశాలు కల్పిస్తామంటూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం నాడిక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రగతిశీల ప్రజాస్వామ్య నాయకురాలు సంధ్య ఆధ్వర్యంలో జూనియర్ ఆర్టిస్టుల సమస్యల పరిష్కారం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యోతి, అపూర్వ, సావిత్రి వంటి జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుతూ తెలుగు ఆర్టిస్టులను కాదని బయట వారిని తీసుకు వచ్చి లక్షలు చెల్లించి వారితో నటింప చేస్తూ తెలుగు వారికి అన్యాయం చేస్తున్నారని అన్నారు. కో ఆర్డినేటర్లు, కో డైరక్టర్లు, నిర్మాతలు చేసే లైంగిక దోపిడీపై వారు గళమెత్తారు. తమకు జరిగిన అన్యాయంపై ఉన్నత స్ధాయి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి తలసాని చేసిన ప్రకటన ప్రకారం జ్యూడీషియల్ విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారి నుంచి కాపాడేందుకు ఔట్‌డోర్ షూటింగ్ సమయంలో మహిళా ఆర్టిస్టులకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు సంధ్య, విమల, సజయ, ఝాన్సీ, కొండవీటి సత్యవతి, విమల, విజయ, కొండేపూడి నిర్మల, సూరపల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు నాణ్యమైన న్యాయం అందించాలి

కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్ 15: ప్రజలకు నాణ్యమైన న్యాయం అందించి మంచి పేరు తెచ్చుకోవాలని కూకట్‌పల్లి 8వ మెట్రో పాలిటన్ స్పెషల్ మేజిస్ట్రేట్ ప్రకాష్ రావు అన్నారు. ఆదివారం కూకట్‌పల్లి సర్కిల్ పాపారాయుడు నగర్‌లో ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కూకట్‌పల్లి బార్ అసోసియేషన్ 13వ వార్షికోత్సవ వేడుకలకు పాల్గొని మాట్లాడుతూ న్యాయవాదులు అందరూ సమానమేనని అన్నారు. న్యాయ స్థానంలో సీనియర్, జూనియర్ అనే బేధాలు లేవని, అందరూ సమానమని చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్న కోర్టు కంటే ప్రస్తుతం మెరుగు సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. మహిళల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం అందజేశామని, త్వరలో కోర్టులో ఉన్న పార్కింగ్, కాలుష్యం సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేసి 50 లక్షలతో కోర్టు కాంప్లెక్స్, ప్రహరీ నిర్మిస్తామని చెప్పారు. కూకట్‌పల్లి కోర్టు భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కబ్జాదారులను, ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులు.. ఎవరైన సీబీసీఐడీ విచారణ జరిపి కబ్జాదారులను శిక్షించి జైలుకు పంపించాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గవర్నమెంట్ ప్లీడర్ రాజేశ్వర్‌రావు, జిల్లా పరిసాలన అధికారి కృష్ణమూర్తి, బార్ కౌన్సిల్ సభ్యులు ఆనంద్‌సేన రెడ్డి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర రావు, మాజీ అధ్యక్షులు నవనీత రావు, ప్రధాన కార్యదర్శి జకీర్ హుస్సేన్, కోశాధికారి శంకర్ రావు, మహిళ కార్యదర్శి వినోద, లత పాల్గొన్నారు.