హైదరాబాద్

ఉస్మానియా పై హామీలు ఉత్తుత్తేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి పేరుగాంచిన ఉస్మానియాకి కొత్త భవనాన్ని నిర్మిస్తామని, సౌకర్యాలు మెరుగుపరుస్తామని ప్రభుత్వం ఉత్తుత్తి హామీలు ఇచ్చిందని నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస రావు విమర్శించారు. మంగళవారం సిటీ ఆఫీసులో విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్.. ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుందని, పెచ్టులూడుతున్నాయని కొత్త భవనాన్ని నిర్మించి ఇస్తామని ప్రకటించినా, నేటికీ అతీగతీలేదని అన్నారు. ఇది ప్రజారోగ్యంపై టీఆర్‌ఎస్‌కు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం నిర్వాహణ, సౌకర్యాల పరంగా ఉన్న సమస్యలతో చికిత్స పొందేందుకు రోగులు భయపడుతున్నారని, మరోవైపేమో ప్రభు త్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని ప్రకటించటం విడ్డూరంగా ఉందని చెప్పారు. కేవలం ఉస్మానియా ఆసుపత్రియే కాకుండా, నగరంలోని దాదాపు అన్ని ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి దయనీయంగా తయారైనా, సర్కార్ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజారోగ్య పరిరక్షణ, సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే ఆసుపత్రి పునరుద్ధరణ, మరమ్మతుల పనులను చేపట్టాలని, ఖాళీగా ఉన్న వైద్యులు, కింది స్థాయి ఖాళీలను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 26న ఉదయం పది గంటలకు ఉస్మానియా ఆసుపత్రి ముందు టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు ఎంఎన్ వివరించారు. ధర్నాను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
టీడీపీ నేతలు పీ.సాయిబాబా, కూన వెంకటేశ్ గౌడ్, వనం రమేశ్, బజరంగ్‌శర్మ, బద్రినాధ్ యాదవ్, షకీలా రెడ్డి, నల్లెల కిషోర్, ఈఎస్ ధనుంజయ పాల్గొన్నారు.