హైదరాబాద్

తనిఖీలు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇదివరకు వారంతపు రోజుల్లో చేపట్టే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎపుడు, ఎక్కడ చేపడుతున్నారో తెలియని పరిస్థితులు నగరంలో ప్రమాదాలను అదుపు చేశాయి. గడిచిన మూడు నెలల్లో నగరంలో 3170 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగా, వీటిలో 1500 మందికి ఒక రోజు నుంచి మూడు రోజుల పాటు జైలు శిక్షలు పడినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం ప్రారంభంలో మూడు నెలల్లో 81 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా, ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి చివరికి 60 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు, గతంతో పోల్చితే 25 శాతం ప్రమాదాలు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. గడిచిన నాలుగు రోజుల్లో డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో కొందరి డ్రైవింగ్ లైసెన్సులను కూడా రద్దు చేస్తూ కఠినంగా వ్యవహారిస్తున్నారు. అతిగా మద్యం సేవించి, ప్రమాదాలకు కారకులవుతున్న మద్యం బాబులపై మున్ముందు మరింత కఠినమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఇలా దరఖాస్తు..అలా నల్లా
*రెండు వారాల్లో మట్టిని తొలగించాలి * జలమండలి ఎండీ దాన కిషోర్ వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 24: పైప్‌లైన్ విస్తరణ పనులు పూర్తయిన అన్ని ప్రాంతాల్లో రెండు వారాల్లో మట్టి తరలింపు పనులను పూర్తి చేయాలని, లేదంటే సస్పెన్షన్ చేస్తామని జలమండలి ఎండీ దాన కిషోర్ అల్టిమేటం జారీ చేశారు. కొత్తగా నల్లా కనెక్షన్లు మంజూరు చేసే ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేయాలని కూడా సూచించారు. మంగళవారం ఆయన బోర్డు ప్రధాన కార్యాలయంలో హాడ్కో, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ మరో రెండు వారాల్లో మట్టి తరలింపు ప్రక్రియను పూర్తి చేలని సూచించారు. ఇంకా మిగిలిన 300 ఎంఎం డయా పైప్‌లైను పనును త్వరితగతిన పూర్తి చేసి జీహెచ్‌ఎంసీకి రోడ్డు మరమ్మతులకు సంబంధించిన ఎన్‌ఓసీని అందజేయాలని ఆదేశించారు. గ్యాపులు, జంక్షన్ల మరమ్మతుల పనుల్లో నాణ్యతలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. నల్లా కనెక్షన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. నూతన నల్లా కనెక్షన్లు ఇచ్చిన వెంటనే తవ్వకాలను పూడ్చివేయాలని వివరించారు. మరో రెండు వారాల పాటు రాత్రిపూట ఆకస్మికంగా తనిఖీలు కొనసాగుతాయని సూచించిన ఎండీ మేనేజర్లు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటనలు నిర్వహించాలని చెప్పారు. సమీక్షలో ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎండీ చర్చించారు. క్షేత్ర స్థాయిలో కార్మికుల సంఖ్యను పెంచాలని ఏజెన్సీలను ఆదేశించారు.