హైదరాబాద్

ఏదీ భద్రత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్, రద్దీ నేపథ్యంలో పాదచారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. అంతేగాక, ట్రాఫిక్ అంచనాలకు మించి పెరగటం, దాన్ని అదుపు చేసేందుకు వీలుగా రోడ్లు అందుబాటులో లేకపోవటంతో ఎప్పటికపుడు ఆంక్షలను అమలు చేస్తూ పోలీసులు కాలం గడుపుతున్నారు. కానీ నగరంలో నిత్యం రద్దీగా ఉండే అన్ని జంక్షన్లలో పాదచారుల కోసం ప్రత్యేకంగా జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేసినా, అవి పాదచారులకు అంతంతమాత్రంగానే ఉపయోగపడుతున్నాయి. అంతెందుకు సచివాలయానికి సమీపంలో ఉన్న లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ సమస్య వర్ణనాతీతం. అక్కడ ఒకవైపు మెట్రో పనులు జరుగుతుండటం, మరో వైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆంక్షల అమలుతో వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. పాదచారుల భద్రత కోసం మరిన్ని చర్యలు చేపట్టేందుకు బల్దియా అధికారులు సిద్ధమైనా, అందుకు స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ పనులు అడ్డొచ్చాయి. ఈ ప్లాన్ కింద నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐదు దశలుగా ప్రభుత్వం స్కైవేలు, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు నిర్మించిన తర్వాత అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి కూడా ఎస్‌ఆర్‌డిపి ప్రతిపాదనలు తయారు కాకముందే పలు చోట్ల ఫుటోవర్ బ్రిడ్జిలు, మరికొన్ని చోట్ల ఎస్కలేటర్‌తో కూడిన ఎఫ్‌వోబిల కోసం అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టినా, ఎస్‌ఆర్‌డిపి పనుల నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రతిపాదనను పక్కనబెట్టినట్లు సమాచారం. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నివారణ కోసం ఎస్‌ఆర్‌డిపి చికిత్స రూపలకల్పన చేసిన ప్రాంతాల్లో కాకుండా ట్రాఫిక్ పెద్దగా లేని శివార్లలోని టిప్పుఖాన్‌బ్రిడ్జి వద్ధ ఫుటోవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. నగరంలో రద్ధీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వంద వరకు ఫుటోవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసి వాటికి ఇరువైపులా లిఫ్టులను కూడా ఏర్పాటు చేయాలని భావించినా, ఎస్‌ఆర్‌డిపి తెరపైకి వచ్చిన తర్వాత కేవలం 25 ఎఫ్‌వోబిలకు మాత్రమే టెండర్లను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కింద నుంచి దాదాపు ఇరవై అయిదు అడుగుల పై వరకు నడిచేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధుల సౌకర్యార్థం లిఫ్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వికలాంగులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా డిజైనింగ్ చేశారు.
ఇక్కడ అవసరం లేదా?
అయితే తొలి దశగా ఎంపిక చేసిన వంద ప్రాంతాల్లో నిమ్స్, మహావీర్, సరోజినీదేవి కంటి ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతిరోజు రోడ్డు దాటేందుకు రోగుల సహాయకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ముందుకు కదలాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు కనీసం పాదచారుల రక్షణ, రోగుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్‌ఆర్‌డిపి ప్రతిపాదనల్లో లేని ఇలాంటి ఆసుపత్రుల ముందు వెంటనే ఎఫ్‌వోబిలను ఏర్పాటు చేయాలని జనం కోరుతున్నారు.
మూడు అంశాలపై ప్రధాన దృష్టి
నగరంలో ఇదివరకే బివోటి ప్రాతిపదికన ఫుటోవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయటం వల్ల నిర్వహణ పరమైన లోపాలు తలెత్తాయి. కొన్ని సార్లు కోర్టుకు వెళ్లిన సందర్భాలు సైతం లేకపోలేవు. అందుకే కొత్త ఏర్పాటు చేయనున్న ఎఫ్‌వోబిలకు సంబంధించి ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఇందులో భాగంగా ఈ ఫుటోవర్‌బ్రిడ్జి తయారీ, అడ్వర్‌టైజ్‌మెంట్, రోజువారీ నిర్వహణ అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నట్లు, ఇందులో నిర్వాహణకు అధికంగా ప్రాధాన్యతనివ్వాలని అధికారులు భావిస్తున్నారు.