హైదరాబాద్

ఆధునిక బస్‌షెల్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విశ్వనగరంగా తీర్చిదిద్దటంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక బస్ షెల్టర్లను అందుబాటులోకి తెచ్చే పనులకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. నాలుగు క్యాటగిరీలుగా 826 బస్ షెల్టర్లను అందుబాటులోకి తేనున్నారను. ఏసీ, ఉచిత వైఫై, ఏటీఎం, సీసీ టీవీ, మొబైల్ ఛార్జింగ్, టాయిలెట్లు వంటి ఆధునిక సౌకర్యాలను కొత్త బస్ షెల్టర్లను ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ (పీపీపీ) ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్న ఈ షెల్టర్లలో ఏసీ బస్ షెల్టర్‌ను మంగళవారం శిల్పారామం వద్ద రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఆధునిక బస్ షెల్టర్లలో మొదటి గ్రేడ్‌లో అడ్వాన్స్‌డ్ బస్‌షెల్టర్‌గా 30 అడుగుల ఎత్తు, 200 అడుగుల వెడల్పుతో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. శిల్పారామం, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద, కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు వద్ద నిర్మిస్తున్నారు. గ్రేడ్-2 బస్ షెల్టర్లలో డస్ట్‌బిన్లు, టాయిలెట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, మంచినీటి సౌకర్యం, వైఫై, ఫ్యాన్లు, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేడ్-3 బస్ షెల్టర్లలో డస్ట్‌బిన్, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్-4 బస్ షెల్టర్లలో కేవలం బస్ షెల్టర్‌తో పాటు డస్ట్‌బిన్లను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. శిల్పారామం, కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు వద్ద నిర్మాణంలో ఉన్న షెల్టర్లను సోమవారం కమిషనర్ జనార్దన్ రెడ్డి తనిఖీ చేశారు.