హైదరాబాద్

ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పాలక మండలి పెద్దలు, పలు పార్టీలు పోటీపడి ప్రతిష్టించిన విగ్రహాల వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. ఇంకెన్నాళ్లు మహానీయుల విగ్రహాలకు ముసుగులు వేసి ఉంచుతారంటూ రాజకీయ, కుల సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు పాలక మండలి, అధికారులు ధైర్యంగా నిర్ణయం తీసుకోవటం లేదు. తాజాగా నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు ఇటీవలే సమీక్షించి, జారీ చేసిన ఆదేశాలు సైతం ఫలించలేదు. నగరాన్ని గ్రేటర్‌గా గుర్తించినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి మేయర్ బండ కార్తీకచంద్రా రెడ్డి ఇందుకు సంబంధించి స్థారుూ సంఘంలో 2010లో తీర్మానం చేశారు.
వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, ఆయనతో పాటు మహాత్మగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని అప్పటి టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస రెడ్డి కోరినా ఫలితం దక్కలేదు. వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సింగిరెడ్డితో పాటు మరికొందరు నేతలు అర్దరాత్రి హడావుడిగా వైఎస్ విగ్రహానికి ఇరువైపులా గాంధీ, అంబేద్కర్ విగ్రహలను ప్రతిష్టించటం సంచలనాన్ని సృష్టించింది. భద్రతా పరంగా సెక్యూరిటీ విఫలమైందంటూ అప్పట్లో అధికారులు సెక్యూరిటీపై చర్యలు కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి కొన‘సాగు’తున్న ఈ వివాదానికి నేటికీ తెరపడలేదు. పైగా ప్రతిష్టించిన విగ్రహాలకు ముసుగులు వేసి కొద్ది సంవత్సరాలుగా గాలికొదిలేశారు. వైఎస్ కాళ్ల వద్ద గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠించటాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ విగ్రహాల జోలికెళితే ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయం పాలక మండలితో పాటు అధికారుల్లో సైతం నెలకొంది. ప్రతిష్ఠించిన మహానీయుల విగ్రహాలను తొలగించేందుకు అధికారులు గతంలో ప్రయత్నాలు చేసినా, ప్రస్తుతం ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు కూడా జంకుతున్నారు. నేటికీ ఈ విగ్రహాలకు ముసుగులు వేసి ఉంచేశారు. వైఎస్ విగ్రహాన్ని ప్రస్తుతం ప్రతిష్ఠించిన చోటే ఉంచి, మిగిలిన రెండు విగ్రహాలను గ్రేటర్ ప్రధాన కార్యాలయంలోనే వేర్వేరు చోట ప్రతిష్ఠించాలని అధికారులు, పాలక మండలి సభ్యులు భావించినా, అభ్యంతరాలెన్నో ఎదురయ్యాయి. రాష్ట్రంలో రాజకీయంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ విగ్రహాం పట్ల కాంగ్రెస్ సభ్యులు కూడా చొరవ చూపకపోవటంతో విగ్రహాల వివాదం పరిష్కారానికి నోచుకోవటం లేదనే వాదన ఉంది. బాపూ, అంబేద్కర్ విగ్రహల సంగతేంటో తేల్చాకే, వైఎస్ విగ్రహాన్ని ప్రారంభించాలని ఎస్సీ ఉద్యోగ సంఘాలు, విపక్షాలు భీష్మించుకున్నాయి. ఈ క్రమంలో ఆ సంఘం సభ్యులు ఇప్పటికే పలుసార్లు సమర్పించిన వినతిపత్రాలు కూడా బుట్టదాఖలయ్యాయి.
వేర్వేరుగా...!
ఈ విగ్రహాల్లో ఒకదాన్ని బూర్గుల రామకృష్ణారావు భవనం పక్కనే ఉన్న మెయిన్‌గేటుకు సమీపంలో, మరోదాన్ని పార్కింగ్ పక్కనే ఉన్న పార్కులో ప్రతిష్ఠించాలని యోచించినా, అదీ అమలుకు నోచుకోలేదు. కానీ వైఎస్ విగ్రహాన్ని మేయర్ ఎంట్రెన్స్ ముఖద్వారం ముందు ప్రతిష్ఠిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలెదురవుతాయోన్నదే అధికారుల భయం.
వైఎస్ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలనే అంశంపై పాలక మండలి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే గానీ, ఈ మూడు విగ్రహాల చిక్కుముడి వీడేటట్లు లేదు. కనీసం స్వరాష్ట్రం, స్వపరిపాలనలోనైనా ఈ విగ్రహాల వివాదానికి తెర దింపేలా ప్రభుత్వం, పాలక మండలి నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

రానున్న ఎన్నికల్లో కర్నాటక ఘట్టం పునరావృతం
* మహానాడుకు సర్వం సిద్ధం
* హాజరుకానున్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
హైదరాబాద్, మే 23: కర్నాటక ఎన్నికల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలే త్వరలో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పునరావృతమవుతాయని నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్‌రావు జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు పోటీపడినా, ఆ పార్టీల కన్నా తక్కువ సీట్లను సాధించిన జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటులో పోషించిన కీలక పాత్ర రేపు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోషించనున్నట్లు వివరించారు. గురువారం జరగనున్న తెలంగాణ రాష్ట్ర మహానాడు సభ ఏర్పాట్లను బుధవారం పలువురు నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం సీటీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎం.ఎన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడుకు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సర్వం సిద్దమైనట్లు వెల్లడించారు. గురువారం ఉదయం ప్రారంభం కానున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నందున, జనసమీకరణలో నగర తెలుగుదేశం నేతలు బిజీగా ఉన్నారు. బుధవారం నగర టీడీపీ అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఎం.అరవింద్ కుమార్‌గౌడ్ ఇతర నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు తెలిపారు. వేదికను ఎంతో అందంగా, ఆకర్షనీయంగా ప్రధాన వేదికను సినిమా ఎఫెక్టులతో తీర్చిదిద్దుతున్నట్లు, ఈ బాధ్యతలను టీడీపీ నేత ప్రదీప్ చౌదరికి అప్పగించినట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో టీడీపీ నేతలు కూన వేంకటేశ్ గౌడ్, లంకెల దీపక్‌రెడ్డి, వనం రమేష్, బజరంగ్ శర్మ, బద్రినాథ్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు షకీలారెడ్డి పాల్గొన్నారు.
‘పసుపు’ రంగు అంటేనే టీఆర్‌ఎస్‌కు భయం
పసుపు రంగు కల్గిన టీడీపీ జెండా అంటేనే టీఆర్‌ఎస్ పార్టీకి భయం పట్టుకుందని, అందుకే మహానాడును పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పార్టీ జెండాలను జీహెచ్‌ఎంసీ అధికారులచే తొలగింపజేస్తుందని నగర ఎంఎన్ ఆరోపించారు. జెండాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈ నెల 5వ తేదీన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ రాసినా, ఎలాంటి స్పందన రాలేదన్నారు. సీపీఎం పార్టీకి అనుమతిచ్చిన జీహెచ్‌ఎంసీ తమ పార్టీ జరుపుకునే మహానాడు సందర్భంగా జెండాలను ఏర్పాటు చేసుకునేందుకు ఎందుకు అనుమతివ్వదని ప్రశ్నించారు.